Iqbal Chand's

గుసగుసలు-10

“కౌముది” గారి గానకచేరి

కౌముది షంషుద్దీన్

కౌముది గారి అసలు పేరు ముహమ్మద్ షంషుద్దీన్. హిందీ సాహిత్యంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసారు తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్లం, పారశీక భాషల్లో  పండితుడు. ఎలా అంటే నిఘంటువు అవసరం లేనంత భాషావేత్త.

మంచి భావకుడు, గాయకుడు, కవి, అనువాదకుడు.హిందీ ప్రేమ్ చంద్ సాహిత్యం అంతటా తెలుగులో అనువదించారు. అలాగే ఉర్దూ నుండి కొన్ని వేల గజల్స్, కవితలు అనువదించారు. తను స్వయంగా కొన్ని వందల కవితలు రాసారు.

దురదృష్టవశాత్తు 1963లో ఖమ్మం జిల్లాలోని నాచారం గ్రామంలో మొహ్మద్ చాంద్ గారి ఇల్లు కాలిపోయింది. కొన్ని వేల బహు భాషల సాహిత్యగ్రంధాలతో పాటు కౌముది గారి సృజన కూడ ఆహుతి అయింది. షేక్ చాంద్  గారు, కౌముది గారి తండ్రి మహబూబ్ అలి గారు ఇద్దరూ సహోద్యోగులు మరియు మంచి మిత్రులు.షేక్ చాంద్ గారి పెద్ద కుమారుడు హనీఫ్ చాంద్, రెండో కుమారుడు మన్సూర్ చాంద్ లతో కౌముది గారిది బాల్య స్నేహం.

1962 కి పూర్వం చాలా కాలం కౌముది గారు వారి ఇంట్లోనే వున్నారు. దాశరధి గారు హనీఫ్ గారి క్లాస్ మెట్. అలా వారి స్నేహం దాశరధి గారి మరణం వరకు నిలిచింది. ఆ కాలంలోనే హనీఫ్ గారి ప్రోత్సాహంతో కౌముది గారి రచనా వ్యాసాంగం సాగింది. కానీ, అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు అందుబాటులో వున్న కౌముది గారి రచనలు కేవలం 1% అన్నా ఆశ్చర్యంలేదు.

 

 మంచి స్నేహశీలి, నిగర్వి, పండితుడు కౌముది గారి రచనలు కొన్ని అయినా మిగిలివుంటే బాగుండేది! అన్నట్లు కౌముది గారి పెద్దబ్బాయి పేరు మీకందరికీ తెలిసిన ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు డా.అఫ్సర్. అలాగే ప్రముఖ కార్టూనిస్ట్, జర్నలిస్ట్ జావెద్ అఫ్సర్ వాల్ల పెద్దమ్మ కొడుకు. అంటే తమ్ముడన్నమాట. కౌముది గారు పాటలు పాడుతున్నప్పుడు వినే అదృష్టం నాకు కలిగింది. కొసరు మాట నేను పుట్టినపుడు నాకు పేరు పెట్టింది కూడా కౌముదిగారే!!!

Website: http://www.dptsarts.com/kowmudi/

4
Leave a Reply

avatar
4 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
4 Comment authors
SirajAfsar MohammadKavyasrifasiuddinf Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Siraj
Guest
Siraj

Good Information!!

Afsar Mohammad
Guest
Afsar Mohammad

బహదూర్, చాలా మంచి జ్ఞాపకాలు. ఇందులో నాకు తెలియనివి కూడా వున్నాయ్.

Kavyasri
Guest
Kavyasri

Nice to know about such a great man

fasiuddinf
Guest
fasiuddinf

Good job