Iqbal Chand's

గుసగుసలు-11

సౌందర్యాత్మక వేదన :ఊర్మిళ కవిత్వం

ఊర్నిళ ఉరఫ్ శొభా భట్
“మ్రుత్యువొక్కతే
చిరకాల నేస్తం” ఆధునిక తెలుగు కవిత్వం లో ఇప్పటివరకు చూడని కవిత్వం పంక్తి. వొల్లు జలదరించింది. నిజమేన అని నమ్మలేక గిచ్చుకోవలసి వచ్చింది. అంగార స్వాప్నికురాలు ఊర్నిళ ఉరఫ్ శొభా భట్ కవిత్వం వొక సౌందర్యాత్మిక వేదనాభరితం. దారి తప్పి ఇటు తెలుగు నేలపై పొరపాటున రాలి పడిన మరో భాషా నక్షత్రం ఈ శొభా కవిత్వం.
ప్రొఫైల్

 “నా శవపేటికను నేనే నిర్మించుకోనా

  అందమైన నగిషీ పనితనం ప్రదర్శించుకోనా” 
ఈ గానమోహ శాపతనపు కవితా నిర్మాణం కచ్చితంగా తెలుగు కవితా వాతావరణానికి పరిచయమైనది కానేకాదు. ఒక వినూత్న భావావిష్కరణ.అచ్చంగా ఉర్దూ లో మీనా కుమారి కూడా ఇలాగే రాసేది.నిజంగా మీనా కుమారి ని శొభా చదివిందో లేదో తెలీదు కాని అచ్చం చాలా పోలికలు వున్నాయి ఇద్దరి కవిత్వంలోను. {కమాల్ అమ్రోహీ ని అవమానించడం కాదు కాని పాకీజా లోని చల్తే
చల్తే కొయి యూహి , మౌసం హై ఆషియాన పాటలు మీనా కుమారియే రాసింది
అని సినీ పండితుల గుసగుస.} 
“జీవించడం అంటే 
 మరణానికి  సంకెళ్లు ” అంటున్న శొభ కవిత్వాన్ని  అనుభవించడానికి తెలుగు కవితా ప్రియులు మరి కొంత మరి కొంత హ్రుదయ విశాలం కాక తప్పదు.ఎందుకంటే రొటైన్ స్త్రీవాద కవిత్వం కాదిది.ఎంటర్టైన్మెంట్ రెగ్యులర్ కవిత్వం అంతకన్నా కాదు.’తుం ఇత్న జో ముస్కురారహి హో జిస్ ఘం కొ తుం చుపా రహి హో ” అని రాసిన కైఫీ అజ్మీ తనం ప్రతి అక్షరం లోనూ బింబ ప్రతిబింబాలు.
“ఎన్ని రంగు రాళ్ళను 
 పోగేసుకుంటేనేమి
 చెదలు పట్టిన మనసుకు” 
“జీవితం ఎప్పుడూ ఆకలిగొన్న దేహమే”
“బాటసారి దారి పొడుగునా గిలక లేని బావులే కదా!”
“అంగవస్త్రాలు విప్పదీస్తే
నెత్తుటి చిత్రిక జీవితం”
ఇంకా ఎన్నెన్ని పంక్తులు చూపను?
రూపచిత్రిక,సంక్షిప్తిత , విలక్షణత , సుతిమెత్తని నజాకత్ భాషా సౌదర్యం, సౌందర్యారాధన , సుందర నిరీక్షణ, ఇదంతా ఊర్మిళ కవిత్వ సారం.
 
రంగూన్ కారాగారంలో చివరి రోజులు ఈడుస్తూ బహదూర్ షా జఫర్ రాసిన ‘ఆజ్ జానేకి జిద్ నా కరో’ ని హబీబ్ వలి మొహమ్మద్ మత్తుగా పాడుతుంటే తన్మయమయినట్లుగా ఊర్మిళ కవిత్వం మనల్ని కమ్ముకొంటుంది.
పులి తన చిన్ని పిల్లల్ని వొక చోటు నుండి  మరొక చోటుకి  నోట కరచి  కింద పడకుండా , కనీసం పంటిగాటు కూడా పడగుండా ఎంత మెళకువగా  తీసుకొనివెళ్తుందో ఊర్మిళ కూడా తన కవిత్వంలొ అక్షరాల్ని అంతే జాగ్రత్త గా అలంకరిస్తుంది..అంటే అది నవజాత శిశువుని తల్లి మొదటి సారిగ తడుముకున్నట్లుగా అన్నమాట ఊర్మిళ కవిత్వం!
నిజం చెప్పాలంటే  ఊర్మిళ తెలుగులో రాసిన పారశీక కవిత్వం ఈ అంగారస్వప్నం.అర్థం కాకపోతే నీ దరిద్రం! అనుభవించలేకపోతే నీ దౌర్భాగ్యం! ఇది ప్రేమ కవిత్వం కాదు. అంతకు మించినది యేదో వుంది. ఇది అది.
ఊర్మిళ కొన్ని కవితలు….

1
Leave a Reply

avatar
1 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
1 Comment authors
Anitha Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Anitha
Guest
Anitha

Nice 👍