Iqbal Chand's

గుసగుసలు-12

Gusagusalu

అమృత ప్రీతమ్ – సాహిర్- ఇమ్రోజ్ ల త్రికోణ ప్రేమ కథ

      అమృత ప్రీతమ్

అమృత ప్రీతమ్ హిందీ, పంజాబీ, భాషల్లో ప్రముఖ కవయిత్రి, నవలా రచయిత్రి వ్యాసకర్త. పద్మశ్రీ, పద్మవిభూషణ్, సాహిత్య అకాడమి అవార్డులతో పాటు జ్ఞానపీఠ్ గ్రహీత. 31-8-1919 న గుజ్రాన్ వాల, పంజాబ్ లో జన్మించింది. 31-10-2005 న డిల్లీ లో మరణించింది. బాలీవుడ్ సినిమా కవుల్లో అగ్రగణ్యుడు సాహిర్ లూధియాన్వి.

8-3-1921 న లుధియానా , పంజాబ్ లోజన్మించాడు. ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. ప్రముఖ ఉర్దూ కవి కూడా. బాలీవుడ్ తో  ఏ కొంచం పరిచయం వున్నా సాహిర్-అమృతల ప్రేమ విషయం తెలిసే వుంటుంది.

సాహిర్ ను అమృత పిచ్చిగా మరీ పిచ్చిగా ప్రేమించింది. సాహిర్ రాసిన “తాజ్ మహల్” కవితను ఫ్రేంగా కట్టి గోడకు వేలాడదీసుకుంది. అమృత ప్రీతమ్ తనకు సిగరెట్టు తాగడం ఎలా  అలవాటయిందో తన మా టల్లోనే ఇలా చెప్పింది.

సాహిర్- అమ్రుత

“సాహిర్ నా గదికి వచ్చి ఒక మూల కూర్చోని సిగరెట్టు ఒకటి తర్వత ఒకటి సుమారు 20 కి పైగా తాగేవాడు. సాహిర్ సిగరెట్టును పూర్తిగా తాగేవాడు కాదు. సగం సిగరెట్టు ని తాగి పారేసేవాడు. సాహిర్ వెళ్ళిపోయాక ఆ సగం సగం సిగరెట్టు బట్స్ ని ఏరి దాచేదాన్ని. అలా దాచినవి నెమ్మదిగా నేను తాగడం అలవాటుగా మారింది. 

ఇమ్రోజ్

సాహిర్ గదికి అమృత ప్రీతమ్ వచ్చినపుడు తను తాగి వెళ్ళిన టీ కప్పులని కడగకుండా  సాహిర్ వాటిని అలానే దాచిపెట్టేవాడు. సాహిర్-అమృతల వీర ప్రేమ కథ ఇంత సినిమాటిక్ గా ఉన్నప్పటికీ, సాహిర్ కోసం అమృత ప్రీతమ్ తన భర్త ప్రీతమ్ సింగ్ ను విడాకులు ఇచ్చినప్పటికీ వాళ్లిద్దరూ కలిసి ఎప్పుడూ లేరు. సాహిర్ సుధా మల్హోత్రా తో చనువు గా ఉంటున్నాడని తెలిసి “మై తుం హే ఫిర్ మిలుంగీ” కవిత రాసింది. 

అమృత-ఇమ్రోజ్

 

అమృత ప్రీతమ్

ఇమ్రోజ్ ఒక ఆర్టిస్ట్. అతను కేవలం అమృత ప్రీతమ్ బొమ్మల్ని మాత్రమే వేసేవాడు. అతని గదిలో అమృత ప్రీతమ్ బొమ్మలు తప్ప మరేమీ కనపడేవి కాదు.

 

కాని అమృత ప్రీతమ్ తో ఎప్పుడూ తన ప్రేమ ప్రకటించలేదట. అమృత ప్రీతమ్, ఇమ్రాజ్ లు జీవితాంతం సహజీవనం చేశారు. ఇమ్రోజ్ అమృత ప్రీతమ్ ని ప్రేమించాడు.

అమృత ప్రీతమ్  సాహిర్ ని, మరి సాహిర్ ఎవరిని ……..?

తర్వాత మట్లాడుకుందాం……

సాహిర్ టాప్ 10 పాటలు

1. కభీ కభీ మేరె

2. మై జిందగీ కా సాథ్

3. ఆగే భీ జానే నా తూ 

4. హమ్ ఇంతెజార్ కరేంగె

5. అభీ నా జావో ఛోడ్ కర్

6. చలో ఏక్ బార్ ఫిర్

7. ఛూ లేనే దో నాజుక్ హోటోంకో

8. హమ్ ఆప్కి ఆంఖోమే

9. యే రాత్ యే చాందిని

10. జిందగీ భర్ నహీ భూలేగి 

ఇమ్రోజ్ చిత్రాలు

 

1
Leave a Reply

avatar
1 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
1 Comment authors
Siraj Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Siraj
Guest
Siraj

Wow.. interesting..thank you