Iqbal Chand's

గుసగుసలు-13

Gusagusalu

వొకడు నామాడి శ్రీధర్ – 2

                  నామాడి శ్రీధర్

నామాడి శ్రీధర్ జీవితం చాలా ఛందోబద్దమైనది. ఇంతటి నియమావళి జీవనసరళి మా గ్రూప్ లో మరొకడు లేడు. నా బాల్యమిత్రుడని అనడం కాదు కాని, నిజం గా మా 30-35 యేళ్ళ సహవాసం లో  ఏనాడు శ్రీధర్ నోటినుండి వొక బూతుమాట కాదు కదా వొక్క పరుషమైన మాట కూడా మేమెవ్వరమూ వినలేదు. (ఒమ్మి రమేష్ బాబు కూడా ఇదే వరుస క్రమం వాడు).

Namadi Sridharఎంతో కోపం వస్తే తప్ప పరమ దుర్మార్గుడు అనే మాట శ్రీధర్  నోట వింపించదు. అలా అని మెత్తటి మనిషి కూడా కాదు. ఐడియాజికల్ గా చాలా బలవంతుడు. మా ’90 కవుల గ్రూప్ లో శ్రీధర్ ధర్మరాజు. సంజయుని భాషలో చెప్పాలంటే మెత్తటి పులి. గత 30 సంవత్సరలలో పత్రికల్లో బహుశా 10 కవితలు కంటే ఎక్కువ అచ్చు అయి వుండవు అతనివి. అయిన కానీ, ప్రముఖ కవులలో ప్రధమ శ్రేణి కవిగా శ్రీధర్ స్థానం సంపాదించుకున్నాడు. 

 

Namadi Sridharఆకుపచ్చ లోయ, బంధన ఛాయ రెండు కవిత్వం సంపుటులను ముద్రించాడు. శ్రీధర్ ని కలసిన ప్రతీసారీ లేదా ప్రతీ మెహెఫిల్లో శ్రీధర్ రాసిన “సిగరెట్” కవిత తన నోటి నుండి తప్పనిసరిగా చదివించుకొంటారు. శ్రీధర్ కవిత్వం చదివే పద్ధతి ప్రత్యేకంగా వుంటుంది.

ప్రతీ అక్షరాన్ని వత్తి మరీ స్పష్టంగా చదువుతాడు. ఎక్కడ  మంచి కవిత దొరికినా సేకరించి హృదయంలో దాచుకొని అందరికీ( నచ్చిన స్నేహితులకు ) వినిపిస్తుంటాడు. భాషా భేదాలు పాటించని సంస్కారి. తన కవిత్వం లో క్లుప్తత, భాషా నిర్మాణం విషయంలో మరీ సంస్కారి.

బంధన ఛాయ

నిజం చెప్పాలంటే అక్షరాల మహాపిసినారి. అసలు రాసేదే చాలా తక్కువ. అందులోనూ అన్నీ సింగిల్ పేజీ కవితలే. అందుకే స్నేహం కొద్దీ పిసినారి అన్నాను. నామాడి శ్రీధర్ కవిత్వాన్ని అభిమానించే వాళ్ళు క్షమించాలి.గాలి నాసర రెడ్డి, నామాడి శ్రీధర్ ల నిర్మాణ పద్దతి మనకు విస్మయం కలిగించక మానదు.

 

Aakupacha Loya
ఆకుపచ్చ లోయ

సంస్కృతాన్ని సంస్కారవంతంగా తెలివిగా దోచుకొని తెలుగుదనం చేసే కవితా నిర్మాణ పద్ధతి, వైచిత్రి వస్తురూపాల నవ్యత నామాడి శ్రీధర్ ప్రత్యేకత. అందుకే శ్రీధర్ సమాంతర తెలుగు కవిత్వం లో  వెన్నెల లాంటివాడు. కవిత్వంలో పొడి తనాన్ని భరించలేని శ్రీధర్ ఒక తడికవి.

శ్రీధర్ కవితలు కొన్ని.

 

4
Leave a Reply

avatar
4 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
3 Comment authors
Gantasala NirmalaP.vidyasagatAkhilaఅనంతు Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Gantasala Nirmala
Guest
Gantasala Nirmala

Dear Iqbalchandgaru,this piece about Namaadi Sridhar is very impressive.Congratulations to you and your team for the commendable efforts.
Thank you for having posted.

P.vidyasagat
Guest
P.vidyasagat

Gatameppudu anubutulato nindiuntundik

Akhila
Guest
Akhila

Good

అనంతు
Guest
అనంతు

పొడి-తడి