Iqbal Chand's

గుసగుసలు-13

Gusagusalu

వొకడు నామాడి శ్రీధర్ -1

               నామాడి శ్రీధర్
 కవిత్వం కోసం దేనినైనా వొదులుకోగలగడం అందునా తెలుగులో….. ఇది సాధ్యమా? ఊహకు అందే విషయమేనా? 
వొకే వొక్కడు వున్నాడు. నామాడి శ్రీధర్. కవిత్వం కోసం నామాడి శ్రీధర్ ఏమైనా చేయగలడు.
 ’90 ల ప్రారంభంలో తన మిత్రులు ఓమ్మి రమేష్ బాబు, శశి లతో “కంజిర” కవిత్వం బులెటిన్ ని నడిపాడు.Namadi Sridhar
 అంబాజీపేట నుండి రాజమండ్రి వచ్చి “కంజిర ” ముద్రణ పనులు చూసుకుంటున్నప్పుడు హోటల్లో భోజనం చేస్తే డబ్బులు ఖర్చు అవుతాయి. 
అలా అయితే “కంజిర” కు డబ్బులు తగ్గుతాయి అని పస్తులు వుండే వాడు. ఆరోజుల్లో “కంజిర” లో తన కవిత అచ్చుకావడం తనకో సర్టిఫికెట్ గా చాలా మంది కవులు భావించేవారు. 
Namadi Sridharకంజిరకు ఆ క్రెడిబిలిటి వుండేది. కవిత్వం ఎంపిక విషయంలో నామాడి శ్రీధర్ చాలా నిర్దయగా వుండే వాడు. జ్ఞానపీఠాధిపతి పంపిన కవితను సైతం బాగోలేని కారణం గా అచ్చువేయలేదు. 
తర్వాత కొంత కాలానికి ఒక దినపత్రికలో సబ్ ఎడిటర్ గా ఉద్యోగం మొదలు పెట్టాడు. 
తన రాజీలేని తనం కారణంగా ఆ ఉద్యోగాన్ని వొదిలేశాడు. కవిత్వం చదవడం , కవిత్వంగా బ్రతకడం, కవిత్వం ముద్రించడం, కవిత్వం గురించి మాట్లాడడం తప్ప శ్రీధర్ మరేమీ చేయడు.
 ఇప్పుడు తన సహృదయ మిత్రులు రమేష్, అనంత్, శోభాభట్  తదితరులతో కలసి “ప్రేమలేఖ ప్రచురణ” ప్రారంభించాడు. 
శివలెంక రాజేశ్వరి, యాజ్ఞి, చిత్రకొండ గంగాధర్ వంటి మంచి కవులు వారి మరణాంతరం వారి అముద్రిత ముద్రిత కవితల్ని సేకరించి సంపుటీకరించాడు. 
ఇప్పుడు మరణించిన కవి మిత్రుడు “కలేకూరి ప్రసాద్” కవితను ప్రచురించే పనిలో తలమునకలై వున్నాడు. 
బంధన ఛాయ

ఈ మధ్య విజయవాడ బుక్ ఎగ్జిబీషన్లో, అనంత్, నౌషాద్, నేనూ తిరుగాడుతూ వొక పుస్తక విక్రేత దారుడిని కవిత్వం ఎలా అమ్ముడుపోతుందని అడిగాం. 

దానికి ఆ షాపు యజమాని (సాహితే ప్రియులందరికే పేరు సుపరిచితమే అయినప్పటికే చెప్పదలచలేదు) జవాబు ఏమిటంటే కేవలం ప్రేమలేఖ ప్రచురణలు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. అని అన్నారు.
Aakupacha Loya
ఆకుపచ్చ లోయ

 నా కవిత్వం కూడా ప్రేమలేఖ ప్రచురణలో చూసుకోవాలని కోరిక. గాని చనిపోయిన వారి కవిత్వాన్నే ప్రస్తుతం శ్రీధర్ చూస్తున్నాడు. మరి నేనేటి చేసేది? శ్రీధర్? నీ జవాబు కోసం చూస్తున్నాను. 

P.S. శ్రీధర్ కవిత్వం గురించి, మరొకసారి మాట్లాడుకుందాం …..  

పదేళ్ల క్రితం నామాడి పై ఇక్బాల్ చంద్ రాసిన కవిత “

గిజిగాడు”

గిజిగాడు

సప్తవర్ణాల
సౌందర్యాత్మక
రూపశిల్పి –

నిశ్శబ్ధ శబ్ధ
సంగీత మాధుర్య ప్రవాహం
పచ్చనాకు లోయల్లో –

చిత్ర చిత్రాల చాతుర్య
హృదయోల్లాస వర్ణ సంవిధానం –

గిజిగాడా!
నువ్వొక అలవాటు పడ్డ నల్లమందువి,
పురాతన మద్యానివి!

 

15
Leave a Reply

avatar
15 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
14 Comment authors
NirupamaP sureshNirupama sharmaShankar RaoPranav Teja Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Nirupama
Guest
Nirupama

Oh! Enta puraatana?
Suresh sir!
Iddaru kalisi enni drunk and drive fine lu Kattaru?
What about tambu?
Nirupama

P suresh
Guest
P suresh

Bhai Jaanji,
Meeray maa puraatana madyam.good article.
Congrats Sreedhar gaaru.
Suresh.pasupuleti.

Nirupama sharma
Guest
Nirupama sharma

Mohammad bhai,
Yeh dosti hum nahin chodinge.
Sridhar gaaru,
Iqbal Chand mee pai raasina poem chadivaara ?
Nijamga old monk poem!

Thanks,
Nirupama sharma

Shankar Rao
Guest
Shankar Rao

Good👍👍👍

Pranav Teja
Guest
Pranav Teja

Baaga enjoy chayyaanu.

Zaid baig
Guest
Zaid baig

I liked this reading.

Feroz
Guest
Feroz

Really enjoyed reading this

Ayaan
Guest
Ayaan

Very nice

Kabir
Guest
Kabir

Good

డా. శారదా హన్మాండ్లు
Guest
డా. శారదా హన్మాండ్లు

చాలా బాగుంది

Krishna prasad
Guest
Krishna prasad

Good job Iqbal

N.alekhya
Guest
N.alekhya

Super

రమేష్ వొమ్మి
Guest
రమేష్ వొమ్మి

సూ సూ సూపర్ ఇ క్బాల్ జీ

Akshaya
Guest
Akshaya

👌🏻 Good

Anitha
Guest
Anitha

Nice