Iqbal Chand's

గుసగుసలు-14

Gusagusalu

సాహిర్- సుధా మల్హోత్రా విషాద ప్రేమ! రెండు కవితలు!

Sahir and Sudha
                                                       సాహిర్- సుధా మల్హోత్రా

ప్రముఖ ఉర్దూ కవి, హిందీ సినిమా గేయ రచయిత సాహిర్ లూధియాన్వి. 08-03-1921 న పంజాబ్ లోని లూధియాన లో ఒక కులీన పంజాబీ ముస్లిం కుటుంబం లో జన్మించాడు. అసలు పేరు “అబ్దుల్ హైమ్”. తల్లి పేరు సర్దార్ బేగం.

సాహిర్ బాల్యం లోనే తల్లిదండ్రులు విడిపోయారు. సాహిర్ తల్లితో ఉండిపోయాడు. మనసును కవిత్వింప చేసే గజల్స్, పాటలు రాశాడు. ఆరోజుల్లో సభల్లో ఉద్రేకపరచే ఉపన్యాసాలూ ఇచ్చేవాడు. లతామంగేష్కర్ తో స్నేహం, తర్వాత రోజుల్లో అది వైరంగా మారింది.

లతా మంగేష్కర్

ఒకవేళ తన పాటని లతా మంగేష్కర్ పాడుతుంటే ఆ పాటకు లతాకు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఒక్క రూపాయి ఎక్కువగా ఇవ్వాలని కండీషన్ పెట్టేవాడు. అది తెలిసి లతా కూడా ఒక్క పాటకు సాహిర్ కు ఎంత ఇస్తే అంతకంటే ఒక్క రూపాయి తను పాడినందుకు ఇవ్వాల్సిందే అని పట్టు పట్టేది.

సాహిర్- అమ్రుత

ఆ తర్వాత సాహిర్ – అమృతప్రీతమ్ ల ప్రేమకావ్యం అందరూ చదివిందే. తర్వాత సాహిర్ జీవితంలో మరో గాయకురాలు సుధా మల్హోత్రా  వచ్చింది. మొదట్లో  సుధా మల్హోత్రా   పాటల అవకాశం కోసం సాహిర్ తన నిర్మాత-దర్శకులందరికీ రికమండ్ చేసేవాడు.

అలా కొన్ని పాటల అవకాశాలు కూడా ఆమెకు వచ్చాయి. అలా అని సుధా మల్హోత్రా   గొంతుని తక్కువ చెయ్యడం కాదు. తక్కువ పాడినప్పటికీ  సుధా మల్హోత్రా  పాటలు శాశ్వతంగా నిలిచిపోతాయి. 

     సుధా మల్హోత్రా 

సుధా మల్హోత్రా   30-11-1936 న కురుక్షేత్ర లో జన్మించింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత. లతా మంగేష్కర్, ఆశా భోస్లే సోదరీమణుల మధ్య పోటీలో పాటల అవకాశం  సుధా మల్హోత్రా   వరకూ వచ్చేవి కావు. అప్పుడు సాహిర్ సహకరించాడు. కారణాలు సరిగా తెలీదు కాని సాహిర్ సుధా ల ప్రేమ కూడా కలకాలం నిలవలేదు.

1960లో గిరిధర్ మోట్వాని ని సుధ పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళి స్థిర పడింది. ఆ తర్వాత సినిమాలకి పాడటం కూడా ఆగిపోయింది. 

సుధా మల్హోత్రా   పాడిన చివరి పాట “తుమ్ ముఝే భూల్ భీ జావ్” (1959). ఈ పాటని సుధా మల్హోత్రానే స్వయంగా సంగీతం సమకూర్చుంది. ఇది  సుధా మల్హోత్రా   కోసం సాహిర్ రాసిన ఒక కవిత. ఆ తర్వాత చాలా కాలానికి  సుధా మల్హోత్రా   జ్ఞాపకాలతో సాహిర్ రాసిన మరో సుందర గీతం “కభీ కభీ మేరె దిల్ మె ఖయాల్ ఆతా హై”. తర్వాత కాలంలో “కభీ కభీ” పేరుతో సినిమా తీశారు. ఆ సినిమా లో ఈ పాటను వాడుకున్నారు. ఈ పాటల నేపథ్యాన్ని  సుధా మల్హోత్రా  ఎండార్స్ చేయడం కొసమెరుపు.

Sudha Malhotraసుధా మల్హోత్రా టాప్ 10 పాటలు

1. తుమ్ ముఝె భూల్ భీ 

2. యె హై ఇష్క్ ఇష్క్

3. నాతో కార్వాన్ కి తలాష్ హై

4.  యె ప్యార్ థా యా కుచ్చ్

5. నా మై ధన్ చాహూన్

6. హమ్ తుమ్హారె హై

7. అప్ని ఖాతిర్ జీనాహై

8. కైసె కహూన్ మన్ కీ బాత్

9. సలాం -ఎ-హస్రత్

10. యె హాథ్ హీ అప్ని దౌలత్ హై 

సాహిర్ టాప్ 10 పాటలు 

1. కభీ కభీ మేరె

2. మై జిందగీ కా సాథ్

3. ఆగే భీ జానే నా తూ 

4. హమ్ ఇంతెజార్ కరేంగె

5. అభీ నా జావో ఛోడ్ కర్

6. చలో ఏక్ బార్ ఫిర్

7. ఛూ లేనే దో నాజుక్ హోటోంకో

8. హమ్ ఆప్కి ఆంఖోమే

9. యే రాత్ యే చాందిని

10. జిందగీ భర్ నహీ భూలేగి 

Leave a Reply

avatar
  Subscribe  
Notify of