Iqbal Chand's

గుసగుసలు-16

Gusagusalu

భారతరత్న భూపేన్ హజారికా

Bhupen Hazarika

టి.వీ. లో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ చూస్తూ ఎగిరి గంతులేసాను.భూపేన్ హజారికా కు మరో ఇద్దరితో కలిపి భారత రత్న ఇస్తున్నారు.

భూపేన్ హజారికా భారతీయ పలుభాషల్లో ప్రముఖ గాయకుడు. పాటలు రాస్తాడు. స్వయంగా సంగీత స్వరకర్త. కొన్ని అస్సామీ సినిమాలు నిర్మించాడు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదా   సాహెబ్ ఫాల్కె అవార్డుల గ్రహీత. 08-09-1926 న జన్మించాడు. 05-11-2011లో మరణించాడు.

ఈశన్య రాష్ట్రాలనించి వచ్చిన వొక డిఫరెంట్ యూనిక్ వాయిస్. తల్లి నించి చిన్నతనం నుండే సంగీతం నేర్చుకొన్నాడు. ప్రారంభంలో కులతత్వానికి వ్యతిరేకం ఉన్న భూపేన్ చివరి రోజుల్లో బి.జె.పి. నుండి అస్సాం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయాడు.

“గంగా బెహతీహై క్యూ ” పాటకు లక్షలాది లాక్షణిక అభిమానులు వున్నారు. నాకు తెలిసి భూపేన్ హజారికా కు తెలుగులో ఇద్దరు అతివీర భయంకర భక్తులు వునారు. వారిలో ప్రముఖ తెలుగు తడి కవి అనంత్ ఒకడు. అచ్చం హజారికా లాగా పాడి గత   రెండు దశాబ్దాలుగా మమ్మల్ని మత్తులో ముంచుతున్నాడు.

Statue of Bhupen Hazarika
Statue of Bhupen Hazarika

రెండో భక్తుడు వినడమే గానీ పాడడు. వాడు నేనే! మా ఇద్దరికి తెలీని హజారికా భక్తులు అసంఖ్యాకం. చాలా కాలం క్రితం నుండి మరణాంతరం వరకు  కల్పనాలాజ్మితో సహజీవనం చేసాడు. భూపేన్ హజారికా కు భారత రత్న ప్రకటించడం పై ఆయన కుమారుడు స్పందిస్తూ” A victory For Diversity “అంటాడు.  

మరొక వార్త కూడా విన్నాను. కర్నాటకకు చెందిన కాంగ్రెస్ నాయకుడు “Books For Remarks an Bhupen Hajarika”

సరే, వివాదాలకేముంది? అవిపుడుతూనే వుంటాయి. వాటి మానాన వాటిని వదిలేసి మన ఇష్టగాయకుడి పాటల్ని విని తరిద్దాం. భారత రత్నకు హజారికా అర్హుడు. ప్రకటించినందుకు పై వారికి శతకోటి ధన్యవాదాలు. ఎగిరి గంతేసినపుడు కాలు మెలికతిరిగి బెణికింది. బహుశా ఈ భారతరత్న భూపేన్ హజారికా కు బ్రతికి వున్నప్పుడు వచ్చివుంటే మనతో పాటు హజారికా కూడా పార్టీ చేసుకొనే వాడు. అప్పుడు కాలు విరిగినా భాధ వేసేది కాదు.    

భూపేన్ హజారిక పాటలు

1. గంగ అమర్ కా

2. దిల్ హూమ్ హూమ్ కరె

3. ఒ గంగ బెహ్తీహై క్యూ

4. ఉగాహె సూరజ్ దెవ్ భేల భీను

5. సమయ్ ఒ ధీరె చలో

6. బుకు హమ్ హమ్ కొరె

7. ఝూటి మూటి మిత్వా

8. మేరె మాథె కా సిందూర్ 

9. హె డోల హె డోల

10. ఆజి అక్షర్

 

భూపేన్ హజారిక సినిమాలు

1. రుడాలి 

2. పపీహ

3. చమేలి మేమ్ సాబ్

4. గజ గామిని

5. అపరూప

6. ఇంద్ర మాలతి

7. చింగారి

8. దామన్

9. సాజ్ 

10. దర్మియాన్

2
Leave a Reply

avatar
2 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
2 Comment authors
Raghu Seshabhattaranant Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Raghu Seshabhattar
Guest
Raghu Seshabhattar

Good write up..In fact I was fascinated to his RUDALI long ago..

anant
Guest
anant