Iqbal Chand's

గుసగుసలు-17

Gusagusalu

స్వప్న చోరుడు సిద్ధార్థ

Siddhartha Kavivaaggeya

సిద్ధార్థ కవి, గాయకుడు అంతే అయితే ఏ గొడవాలేదు. మా అన్న అసుర మాటల్లో చెప్పాలంటే “సిద్ధార్థ కవిత్వం బాగోతులోనిరంది. సిద్ధార్థ స్థూలదృష్టికి కవి. కానీ ఆయన కేవలం కవి కాదు. He is more than a poet ” నిజంగానే అంతే! He is more than a poet!

30 యేళ్ళ బట్టి సిద్ధార్థ  కవిత్వం విన్పిస్తున్నాడు. తనతో ఎన్నో చీకటి రాత్రులే కాదు వెన్నెల రాత్రులూ గడిపాను. కానీ, ఇప్పటికీ కనిపెట్టలేకపోయాను సిద్ధార్థ  కవిత్వంలోని More than a poet గుణం ఏమిటో!

ఏదో వుంది, ఏదేదో కచ్ఛితంగా సిద్ధు చెప్పడనికి ప్రయత్నిస్తూనే వున్నాడు. కొంతమంది వేగుంట మోహనప్రసాద్ కు కొనసాగింపు అని లేదా తెలంగాణ ‘మో’ అని అంటారు కానీ, అది నిజం కాదు. ఏదో వుంది సరిగానే పొట్లంకట్టాడు. కానీ సరిగా పొట్లం మాత్రం విప్పడం లేదు. సిద్ధూని కలిసిన ప్రతీసారీ ఇతడు ఇప్పుడే గాఢ స్వప్న నిద్ర లోంచి లేచాడా అనిపిస్తుంది! అసుర భాయ్!ఇది నిజం! నువ్వున్నది  ముమ్మాటికీ నిజం!

తెలుగు కవిత్వం పాఠకులకు ఇది సరికొత్త అనుభవం. మునుపెన్నడూ ఇట్టి కవిత్వాన్ని చూసి  ఎరుగరు. నామటుకు నాకైతే అతని టైటిల్స్ చూస్తేనే జ్వరం వొస్తోంది. లోరీ, పానా, రాగివెన్నెల, దిల్లాద్, ఆల్ బుకారా కల, విదు:ఖిత  కల, కాస్మికుడు, జీన్ గాయం, ఇలా ఎన్నని చెప్పను. కదిలిస్తే చాలు అల్లుకొని పోతాడు. అది తన కాస్మోలో కావొచ్చు, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్ ఇల్లు కావొచ్చు…..

గత 30 సంవత్సరాల మా స్నేహం ఇంకా ఆగిపోని పాట.మళ్ళీ మళ్ళీ సిద్ధూ ని చదువు తుంటాను. మళ్ళీ మళ్లీ కావాలనే జ్వరపడుతుంటాను. ఎందుకంటే ఆ జ్వరంలో నేనొక్కడినే నన్ను నేను పలకరించుకొంటాను. తడుముకుంటాను.అల్లుకుంటాను. మీరు జ్వరపడాలంటే దీపశిఖ, బొమ్మలబాయిని చదవండి.

 సిద్ధన్నా! మన చలిరాత్రుల పాటలకు సలాం!

సిద్ధన్నా! నీ కవిత్వం అంతా అర్ధమైంది అని బొంకే సాహసం నాకు లేదు! కానీ నా జ్వరప్రేలాపన లోని కొన్ని మూల్గులను నువ్వు అక్షరీకరించావు! థాంక్స్ రా!

ఇప్పుడు ఈ మాట చెప్పడం ఇక్కడ సబబుగాదు కానీ, ఆ రోజుల్లో మా రాత్రుల గానాబజానా తడికవి అనంత్ ఇంట్లో నిరంతర ప్రవాహంగా సాగేది. ఏ అర్ధరాత్రో ఆకలేసి తినడానికి ఏమీలేకపోతే సిద్ధార్థ ఇంటికి ముందుగా చెప్పా పెట్టకుండా (ఆ రోజుల్లో మొబైల్స్ ఇంకా రాలేదు) వెళ్ళేవాళ్ళం. ఆ అర్ధరాత్రి సిద్ధార్థ భార్య సునీత చిర్నవ్వుతో తలుపుతీసి మాకు అన్నం వండి పెట్టేది.

అందుకే సిద్ధార్థ ఇంటిని ప్రేమగా “సునీత మెస్ ” అని పిలిచే వాళ్ళం. సరిగా గుర్తులేదు కానీ ఈ సునీత మెస్ అన్న పేరు అనంత్ లేదా చిత్రకొండ గంగాధర్ పెట్టినట్టు గుర్తు. కవిత్వం కోసం సిద్ధార్థను తలుచుకుంటే ఆ కాలంలో అన్నం కోసం సునీతను గుర్తు పెట్టుకోవడమూ అంతే అవసరం. 25 యేళ్ళల్లో ఎప్పుడూ చెప్పే సందర్భం రాలేదు.

ఈ సందర్భంగా సునీతకు మెనీ థాంక్స్ . అలాగే సమయమూ సందర్భమూ లేకుండా ఇంటికి వెళ్తే ప్రేమగా అన్నం వండి పెట్టే మరో జంట మా అన్న కవి యాకూబ్ మా వదిన, ప్రముఖ కవయిత్రి డా. శిలాలోలిత. వాళ్ళ గురించి వివరంగా మరో చోట మరో సారి…. అప్పటివరకు శెలవ్!

P.S: సిద్ధార్థ, ఒమ్మిరమేష్ బాబు, నాది ముగ్గురి మొదట కవిత అచ్చులో ఒకే రోజు పక్క పక్కన  ఆంధ్రజ్యోతిలో త్రిపురనేని శ్రీనివాస్ వేశాడు.  

సిద్దార్థ కవిత్వం గురించి ఇంకోసారి

 

సిద్ధార్థ కొన్ని కవితలు

 

 

 

5
Leave a Reply

avatar
5 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
4 Comment authors
SampathAfsarSirajAnitha Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Sampath
Guest
Sampath

Nice sir!

Afsar
Guest
Afsar

Beautiful

Afsar
Guest
Afsar

Beautiful!

Siraj
Guest
Siraj

Salaam Siddu ji

Anitha
Guest
Anitha

Nice