Iqbal Chand's

గుసగుసలు-19

BVV Prasad

తెలుగు  హైకూల  చిరునామా  బి.వి.వి. ప్రసాద్

BVV Prasad     

           తెలుగులో  హైకూల  ప్రస్తావన  వస్తే  హైకుత్రయంలో ఒకరు  బి.వి.వి. ప్రసాద్ .

   చాలా  మంది హైకూలు రాసినప్పట్టికీ  నాసరరెడ్డి,బి.వి.వి ల గాఢత , క్లుప్తత  స్థాయి  కొంచెం  ఒక మెట్టు  ఎక్కువ.

    నామాడి శ్రీధర్ తన కవిత్వానికి  హైకూ అని పేరు పెట్టకపోయినా ఆతని కవిత్వానికీ అదే గుణం       ఉంది.

    ఏదో  కాలక్షేపానికి  న్యూస్ పేపర్  చదివినట్లు గా  చదివితే  బి.వి.వి  హైకూలు  ఎంత మాత్రం  హృదయానికి   చేరవు. కొంచెం మనసు పెట్టి   చదవాలి.

      కొంచెం  ప్రేమించగలిగిన  తనంతో చదవాలి.

    కొంచెం ప్రేమ రాహిత్యం తనంతో  చదవాలి.

  కొంచెం  ప్రకృతిలో  లీనమైన  గుణం కలిగి  చదవాలి .

        అప్పుడు కానీ బి. వి. వి  గారి  హైకూలు  దానిమ్మ గింజలు   కళాత్మకంగా వొలుచుకొని  గింజ  నలగకుండా రసాన్ని చప్పరించినట్టు గా బి.వి.వి  హైకూల్లోని  సాంద్రమైన  ప్రకృతి  అలంకరించుకొన్న తాత్విక  అనుభూతిని  అందుకుంటాం.

ఓ క్షణం  జీవించాను

 అలపై  చిట్లిన

వెన్నెలను తాకబోయి

***

 దూరంగా దీపం

 దానిని కాపాడుతూ

 అంతులేని చీకటి

***

రాత్రి ఆకాశం

 వెన్నెలకు  తడుస్తూ

వెన్నెలకు  ఆరుతూ

***

     ఏదో విశ్లేషణ  చేసి పై   హైకూలను  ప్రతిపదార్థ  తాత్పర్యం  చెప్పి చేతులు దులుపుకోలేను. రసజ్ఞులు  మీరే  అనుభవించండి.

మీ సౌందర్యాత్మక తాత్వికతను వెతుక్కోండి.

Hykuluబి.వి.వి ప్రసాద్ కవిత్వం ఒక ఊట చెలమ. ఎంత తోడుకున్న ఇంకా జలం ఊరుతూనే వుంటోది. దాహార్తి రసజ్ఞత స్థాయిపై  ఆధారపడి  ఉంది. మీ కవిత్వం  పెక్కు మాటలేలవో తెలుగు చదువరీ బి.వి.వి ప్రసాద్ గారి  హైకూ  సంపుటాలు దృశ్యాదృశ్యం, హైకూ, పూలు రాలాయిలను  తెరవండి.

తను  అనువాదం  చేసిన  బషో  హైకూలను కూడా అనుబంధంగా అచ్చువేశారు.  చనిపోయే కీచురాయి జీవితమంతా నిండిన  దాని పాట.

 కోయిల కూత  ఏకాంత ద్వీపంలోకి  అదృశ్యమైంది.

 తెలుగు నేలకు గత 15 సంవత్సరాలుగా దూరంగా ఉన్న నాకు బి. వి. వి  కవిత్వం  ఎంత  ప్రభావం  చూపిందో  లెక్కగట్ట లేను, గాని గత 20 ఏళ్లుగా ఆయన  కృషి మాత్రం  ప్రశంసనీయం.

P.S: బి. వి. వి  గారు  మనం  చాలా  తక్కువగా  కలిశాం  కొన్ని సార్లు  మాత్రమే  ఫోన్ లో  మాట్లాడుకున్నాం .అయినా బెంగ  లేదు.  మీ  తక్కువ  మాటల్లోనే   హృదయానికి  సరిపోయే  అంత ప్రేమతో  మాట్లాడారు.  మీ స్నేహానికి కృతజ్ఞతలు.

               Iqbal Chand                                                                                                              

2
Leave a Reply

avatar
2 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
2 Comment authors
NirupamaSiraj Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Nirupama
Guest
Nirupama

BVV prasad gaari parichayam baavundi. Vaari kavitvam pai prema kaliginchindi. Thanks sir!

Siraj
Guest
Siraj

Hykulu … interesting to read and enjoy