Iqbal Chand's

గుసగుసలు -20

Mr. 360° బహుముఖాలు!!

అత్యాధునిక అంతర్జాతీయ క్రికెట్  ప్రపంచంలో A.B.D పేరును ప్రేమించని వారు ఉండరు. విధ్వంసకరమైన ఎన్నో రకాల un orthodox షాట్స్ ను మెరుపుల్లా  మెరిపిస్తాడు. అందుకే క్రికెట్ లోకం A.B డివిలియర్స్ ని మిస్టర్ 360 డిగ్రీస్ అని ముద్దుగా పిలుచుకుంటారు.

   A.B బ్యాటింగ్ చేస్తుంటే నాకు మటుకు నేను ఎంత ముఖ్యమైన అత్యవసరమైన పని ఉన్నప్పటికీ వాయిదా వేసుకుంటాను. ఆ సమయంలో చావు పిలిచినా అవుట్ అయ్యే వరకు ఆగమని బ్రతిమిలాడుకొంటాను.                                 

********

 

17-02-1984న  సౌత్ ఆఫ్రికా లో పుట్టాడు. ఇక ఇతని రికార్డులు చూడాలంటే రెండు కళ్ళు చాలవు. అది 18-01-2015. వెస్టిండీస్ తో 50 ఓవర్ల మ్యాచ్. తను ఫేస్ చేసిన మొదటి 15 బంతుల్లో 50 రన్స్, 30 బాల్స్ లో సెంచరీ మొత్తం ఆ మ్యాచ్ లో 59.5 నిమిషాలు బ్యాటింగ్ చేసి 44 బంతులు ఆడి 149 రన్స్ చేశాడు. ఆ రోజు ఇన్నింగ్స్ ని చూడడం జీవితంలో ఓ మధురానుభూతి. అద్భుతమైన ఫీల్డర్ కూడా.

తన గర్ల్ ఫ్రెండ్  డానియల్ స్వార్ట్ ను 2012లో తాజ్ మహల్ ఎదురుగా ప్రపోజ్ చేశాడు. 2013లో బెల బెల లో వివాహమాడారు. వారికి ఇద్దరు పిల్లలు. A.B డివిలియర్స్ తన దేశం తరపున హాకీ, ఫుట్ బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్ చాంపియన్. స్కూల్ రోజుల్లో స్విమ్మింగ్ లో అతనో రికార్డ్ .ఇవన్నీA.B.D కి ఒకవైపు మాత్రమే A.B.D పాటలు రాస్తాడు.గిటార్ వాయిస్తాడు. పాటలు పాడుతాడు. ఇంకా ముఖ్యంగా వీటికి మించి తను చాలా ఎక్కువగా చారిటీ కూడా చేస్తాడు.

Leave a Reply

avatar
  Subscribe  
Notify of