Iqbal Chand's

గుసగుసలు-3

డబ్బూ అను తెల్ల కుక్క పిల్ల  మరియూ  చింటూ అను బొద్దు పిల్లి…

భారతీయ సిల్వర్ స్క్రీన్ పై షోమాన్ , మహానటుడు , నిర్మాత,దర్శకుడు , దాదా ఫాల్కె అవార్డ్ గ్రహీత రాజ్ కపూర్ గురించి ఎవరికి తెలీదు చెప్పండి? 
తెర పై ఎంత చిత్రమైన  నటుడో,   తెర వెనుక జీవన విధానం కూడా అంతే విచిత్రమైనది.రాజ్ కపూర్ గురించి వేరే చోట చెప్పుకుందాం.  కానీ ప్రస్తుతానికి  అతని ఇద్దరు కొడుకుల పేర్ల వెనుకటి తమషా ఏమిటో  చూద్దాం.
రాజ్ కపూర్ పెద్ద కొడుకు పేరు రణధీర్ కపూర్ . అప్పటి కాలానికి నటుడు కూడా. అలనాటి తార బబిత కు భర్త.  కరిష్మా కపూర్,  కరీనా కపూర్ లకు ఫాదర్.  రణధీర్ సినిమాల్లొ నటించడం వల్ల సంపాదించిన పేరు కంటేనూ బాగా తాగడం ఇంకా బాగా తినడం వల్ల వచ్చిన ఖ్యాతి ఎక్కువ అని అంటారు.
రణధీర్ కపూర్ ముద్దు పేరు డబ్బూ . ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? రణధీర్ కపూర్ వాళ్ళ తాత గారు మొఘల్- ఎ – ఆజం సినిమా అక్బర్ ఫేం ప్రుధ్విరాజ్ కపూర్ ఒక తెల్లటి కుక్క పిల్ల ని పెంచేవారట. దాని ముద్దు పేరు డబ్బూ. రణధీర్ పుట్టిన్నప్పుడు తెల్లగా వున్నాడు కాబట్టి  ” ఎ లడ్కా డబ్బూ జైస హై ”  అని అన్నారట. అంతే!!!!! అప్పడి నుండీ రణధీర్ డబ్బూ గానే పిలవబడుతున్నాడు.
అసలుకు ఆ పేరు ఒక కుక్క పిల్ల ది అనే విషయాన్ని డబ్బూ నే ఇటీవల వెల్లడించాడు ఏడ్వ లేక  నవ్వుతూ…
 అలాగే రాజ్ కపూర్ రెండో కొడుకు పేరు రిషి కపూర్. ఇతనో మాంచి రోమాంటిక్ హీరో ఆ రోజుల్లొ. ఇతని ముద్దు పేరు చింటూ. ఆ రోజుల్లో రాజ్ కపూర్ ఇంట్లో ఒక పిల్లి పిల్ల ఉండేది.దాని ముద్దు పేరు చింటూ. రిషి పుట్టినప్పుడు డబ్బూ అతణ్ణి  చూసి చింటూ
చింటూ    అని అరిచాడు. అలా రిషి పేరు చింటూ అని స్థిర పడింది.
అంటే రాజ్ కపూర్ ఇంట్లో ఇద్దరు డబ్బూలు ఇద్దరు చింటూలు అన్నమాట.

1
Leave a Reply

avatar
1 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
1 Comment authors
Rubeena kausar Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Rubeena kausar
Guest
Rubeena kausar

Oh… Now i came to know why they were called as dabbu and chintu