Iqbal Chand's

గుసగుసలు-4

ట్రాజడీ క్వీన్ మీనా కుమారి

హిందీ చలన చిత్రసీమ లో మీనా కుమారికి వొక ప్రత్యేక స్థానం వుంది. మన మహానటి సావిత్రి కు సమకాలీనురాలు. తులనాత్మకంగా పరిశీలిస్తే ఇద్దరికి చాలా పోలికలు వున్నాయి.

మీనా కుమారి అసలు పేరు “మెహజబీన్”.  చైనీస్ డాల్,  ట్రాజడీ క్వీన్, ఫిమేల్ గురుదత్, హింది సినీ సిండరిల్లా ఇలా అనేక పేర్లతో పిలిచేవారు.

01-08-1933 న జన్మించింది. 31-03-1972 కేవలం 38 సంవత్సరాల వయస్సులో మరణించింది. మీనా కుమారి అద్భుతమైన కవిత్వం రాసింది. ఆమె కలం పేరు “నాజ్”.

మీనా కుమరి అమ్మమ్మ హేమసుందరి టాగోర్. రవింద్రనాథ్ టాగోర్ కు సమీప బంధువు. 4 సంవత్సరాల  వయస్సు నుండే నటన మొదలు పెట్టింది.

1952 ప్రముఖ కవి, దర్శకుడు   “కమాల్ అమ్రోహి” ని నిఖా ఆడింది. సున్నిత హృదయురాలు. కమాల్ అమ్రోహికి మీనా కుమారికి నడుమ వయసురీత్యా చాల వ్యత్యాసం వుంది. ఎందుకో కానీ వారి వివాహబంధం సజావుగా సాగలేదు. పార్టీల్లో కల్చర్ కోసం అలవాటయిన  ఆల్కహాల్ చివరికి దానికి బానిసగా మారింది.

ఆమెను ప్రేమించిన ప్రముఖుల లిస్ట్ కూడ చాల పెద్దదే! నా గుసగుసల్లో వినిపించిన కొందరి పేర్లు: దిలీప్ కుమార్, రాజ్ కుమార్, ప్రదీప్ కుమార్, ధర్మేంద్ర గుల్జార్ అని అంటారు.కాని మీనా కుమారి మరణాంతరం గుల్జార్ ఆమె కవిత్వాన్ని సంపాదకత్వం వహించి రాసిన మాటల్లో ఆపా (అక్క) అని సంభోదించాడు. ఏది ఏమైనా తాగుడుకు బలైన తొలి తరం నాయికల్లో తొలి నాయిక మీనా కుమారి. మీనా కుమారి పై పలువురి అభిప్రాయాలు.

Madhubala :   Meena Kumari has the most unique voice. No other heroin has it.

Satyajit Ray :  Undoubtedly an actress of the highest caliber.

Amitabh Bachan :  “No one, not any one , ever spoke dialogues the way Meena Kumari did.”

Naushad ( Music Director ) :   Hindi  film industry may produce great actress but there would never be another Meena Kumari.

టాప్ 10 మీనా కుమారి పాటలు

1. అజీబ్ దాస్థాన్ హై యె

2. తుం హి హొ మాత పితా

3. ఛూలేనె దో నాజుక్

4. హంసఫర్ మేరె హంసఫర్ 

5. మధుబన్ మె రాధా

6. జ్యోతి కలష్ ఛల్ల్ కే

7. యే మేర దీవానపన్

8. వాదియా మేర దామన్

9. దిల్ అప్న ఔర్ ప్రీత్ పరాయి

10. మేరి యాద్ మే తుమ్

టాప్ 10 మీనా కుమారి సినిమాలు

1.  పాకీజా

2.  దిల్ అప్న ఔర్ ప్రీత్ పరాయి

3. ఆజాద్

4.  కాజల్

5. పరిణీత 

6. సహిబ్ బీవి ఔర్ గులాం

7. బహు బేగం

8.  కోహినూర్ 

9. గజల్ 

10. ఫూల్ ఔర్ పత్థర్

1
Leave a Reply

avatar
1 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
1 Comment authors
Kavya M Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Kavya M
Guest
Kavya M

Lovely tribute article on Meena Kumari :)..Thank you for such a wonderful article.