Iqbal Chand's

గుసగుసలు-5

గుసగుసలు-5

1

   31-డిశెంబర్ : కొత్తపల్లి

“వెలుతురు పిట్టలు” కవి కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ గారి జన్మదినం 31-డిశెంబర్.1992-1994 మధ్య కాలంలో కంజిర మిత్రులతో పాటు మేము ఆయనతో చాలా సాయంత్రాలు గడిపాం.కవిత్యం లో బ్రీవిటీ గురించి ఆయన్ని చాలా సార్లు హింసించేవారం. ఎందుకో “చెట్టుకవి” ఇస్మాయిల్ గారంటే ఆయనకి ఎక్కడలేని కోపం. ఒకప్పుడు కొత్తపల్లి, ఇస్మాయిల్ గారూ మంచి మిత్రులు. కానీ, తర్వాత కాలంలో ఇద్దరూ బద్ద శత్రువులయ్యారు. ఇద్దరి మధ్య శత్రుత్వానికి కారణం ఇద్దరిని అడిగాం నామాడి శ్రీధర్, నేను కానీ ఎవరూ సరైన కారణం చెప్పలేదు. మా పరిశోధనలో తెలిసిందేమిటంటే “వజ్రాయుధం” కవి ఆవంత్స సోమసుందర్ గారు అసలు కారణం అని. ఇప్పుడు వాళ్ళు ముగ్గురూ లేరు.వారితో గడిపిన అనేక 31-డిశెంబర్లు మా వెంట వున్నాయి. విచిత్రం ఏమిటంటే కొత్తపల్లి మరణం కూడా 31-డిశెంబర్.

 

గుసగుసలు-5

2

రాజ్ కపూర్ ఇంట్లో పార్టీ: 10th  పాస్

                                                      పృథ్వి రాజ్ కపూర్, 10th ఫెయిల్

   రాజ్ కపూర్,10th ఫెయిల్

 

శశి కపూర్, 10th ఫెయిల్

 

షమ్మీ కపూర్, 10th ఫెయిల్

 

                                                                 రణధీర్ కపూర్,  10th ఫెయిల్

        రిషి కపూర్, 10th ఫెయిల్

 

రాజీవ్ కపూర్, 10th ఫెయిల్

           

                                                          కరిష్మా కపూర్10th ఫెయిల్

 

కరీనా కపూర్, 10th ఫెయిల్

 

                                              రణబీర్ కపూర్, 10th పాస్

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఏకైక షోమాన్ రాజ్ కపూర్ వంశ వృక్షం గురించి ఎవరికి తెలవదు? పృధ్విరాజ్ కపూర్, రాజ్ కపూర్,షమ్మి కపూర్, శశి కపూర్, రణధీర్ కపూర్, రిషి కపూర్, రాజీవ్ కపూర్, కరిష్మా కపూర్, కరీనా కపూర్, వీరందరూ ఎంతెంత ప్రముఖులో మనందరికీ తెలుసు.

31 డెశెంబర్ రాత్రి రాజ్ కపూర్ భార్య క్రిష్ణాకపూర్ పెద్ద బాలీవుడ్ పార్టీ ఎరేంజ్ చేశారు. పార్టీకి కారణం 31 డెశెంబర్ కానేకాదు. మరి పార్టీ ఎందుకంటే పైన ఉదహరించిన మహా నటీనటులు ఎవ్వరూ 10th  పాస్ కాలేదు. వారి వంశంలో మొదటిసారిగా రిషి కపూర్ కొడుకు నేటి చాక్లెట్ బాయ్ హీరో రణబీర్ కపూర్ 10th  పాస్ అయ్యాడు. అంటే కపూర్ వంశంలో రణబీర్ చరిత్ర సృష్టించాడు. 10th పాస్  అయి, అదీ 53% శాతంతో. అందుకే క్రిష్ణాకపూర్ కనీవినీ ఎరుగని రీతిలో బాలివుడ్ ప్రముఖులందరినీ పార్టీకి పిలిచారు. ఆ పార్టీ రాత్రంతా గడిచింది. రణబీర్ కపూరే వాళ్ళ వంశంలో ఆఖరి 10th  పాస్ అయిన వారు కూడా ఇప్పటివరకూ.

 

 

2
Leave a Reply

avatar
2 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
2 Comment authors
KavyaHemalatha putla Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Kavya
Guest
Kavya

Happy New Year all…..

Hemalatha putla
Guest

☺️ 10th ఫెయిల్ అయితే సినిమా తారలు అవుతారన్న మాట