Iqbal Chand's

గుసగుసలు-6

Happy New Year

మిత్రులారా !నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Thank you so much for your kind support.

1.
ఇప్పుడు నేను టీ.వీ.లో దేశ ప్రధాని శ్రీ మోడీ  గారి ఇంటర్వ్యూని చూస్తూ ఈ నాలుగు మాటలు రాస్తున్నాను.  దేశం లో యువత ఆకాంక్షలు పెరిగాయి అని అంటున్నారు.
2.
ఒకప్పుడు కాంగ్రెస్  ముక్త్ దేశ్ అన్నారు. ఇప్పుడు బలమైన ప్రతిపక్షం కావాలని అంటున్నారు. ఈ మెలిక నాకు అర్థం కావడం లేదు. ఇటీవల ఉత్తరాది ఓటమి బాధ్యత కూడా తీసుకోవడం లేదు. ఏది ఏమయినా మోడి గారు మోడీ గారే …
                                                                             3.
మేము కఠినంగా వ్యవహరించడం వల్లనే బ్యాంకు  దొంగలు (నీరవ్ మోడి,విజయ్ మాల్యా తదితరులు…. ) దేశం వదిలి పారిపోయారు అని అంటూన్నారు. బ్యాంకు దొందల్ని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం అని అంటూన్నారు శ్రీ మోడీజీ . అసలు పారిపోడానికి అవకాశం ఎందుకు  ఇవ్వాలి? ఆపై పట్టుకోడానికి  ప్రయత్నించడం ఎందుకో నా బుర్ర కి దొరకని జవాబు.
ఇంకా టీ.వీ లో మోడీజీ ఇంటర్వ్యూ సాగుతూనే వుంది.
 ఇంటర్వ్యూవర్  రామ మందిరం సమస్య గురించి అడిగిన ప్రశ్న కి జవాబు గా ట్రిపుల్ తలాక్ గురించి వివరిస్తున్నారు. వావ్ మోడీజీ క్యా బాత్ హై !!!!
4.
క్రిషి ఉంటే పురుషులు రుషులవుతారట అని విన్నప్పుడు  ఎలా అనుకున్నాను కాని  ఇప్పుడు బాగా తెలిసింది మోడీజీ. మిమ్మల్ని చూస్తుంటే కొండంత అండగా అనిపిస్తుంది. నా కొడుకు కవిత్వం రాస్తాను కవిత్వం  రాసాను అని సరదాపడుతున్నాడు. నేనేమో అరె నాయనా !!! నువ్వు కవి అవుతే నా లాగ దేనికీ పనికిరాకుండా పోతావు, చాయ్ అమ్మటం మొదలు పెట్టు, ఏదో నాటికి నువ్వూ మోడీ అవుతావు అని
ఆశీర్వదించాను.
నిర్ణయం వాడి ఇష్టం !!!!!!

3
Leave a Reply

avatar
3 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
3 Comment authors
SirajAnuHemalatha putla Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Siraj
Guest
Siraj

Very Nice…

Anu
Guest
Anu

Nice 👏🏻

Hemalatha putla
Guest

ఎవర్నీ వదిలేలా లేరు కదా ! 😀