Iqbal Chand's

గుసగుసలు-7

ఆకస్మిక అదృశ్య కవి : చిత్రకొండ గంగాధర్

చిత్రమైన కవి చిత్రకొండ గంగాధర్.

1990-91 మధ్య కాలంలో ఒక రోజు సాయంత్రం నా గదిలోకి ఒక బక్కపలచని సుమారు 19-20 సంవత్సరాల వయసు కుర్రోడు వచ్చాడు. సార్! మీ మిత్రుడు ఓమ్మి రమేష్ బాబు నన్ను మీ దగ్గరకి పంపించాడు అని మర్యాదగా చెప్పాడు. బహుశా ఏ పుస్తకం కోసమో రమేష్ పంపించి వుంటాడు అనుకుని సరే కూర్చో అన్నాను. నన్ను బహుశా ‘సర్’ అని పిలిచిన మొదటి పిలుపు కూడా అదే అనుకుంటాను.కొంచెం సమయం గడిచాక తనను తాను గంగాధర్ గా పరిచయం చేసుకొన్నాడు. కవిత్వం రాస్తున్నను అని అన్నాడు.

నా తాళం లేని గదిలో కొంత చోటు కోసం ఆ ఒక్క లింకు చాలు ఆ రోజుల్లో. ఒకే ఒక్క జత బట్టలు. అదీ ఒంటిపై వేసుకున్నదే,రెండో జత బట్టలు లెవ్వు. చెప్పులు ఉన్నాయో లేదో సరిగా గుర్తులేదు. కొన్నిరోజులు అలానే ఉన్నాడు నా గదిలో, పిలిచినపుడు అన్నానికి వచ్చేవాడు లేదా నేను మర్చిపోతేనో లేక నీను లేనప్పుడో పస్తులుండేవాడు. అతను నన్ను ఎప్పుడూ ఏరకమైన ఇబ్బందీ పెట్టలేదు తనలోకంలో తను వుండేవాడు. అదొక రకమైన బైరాగియన్ తనపు స్వాప్నిక లోకంలో విహరించేవాడు.తను వంటిపైని బట్టలు ఉతికేటప్పుడు నా బెడ్డుపైని దుప్పట్ని లుంగీగా కట్టుకునేవాడు అని గుర్తు. మరి కొంతమంది మిత్రుల్లాగ నా చొక్కాలు, బనీన్లు తదితరాలు వాడలేదు. అలా కొంత కాలం వున్నాడు.ఆకస్మికంగా చెప్పకుండా వెళ్ళిపోయాడు.రమేష్ ని అడిగితే వురేయ్  అతగాడంతేలే రా నువ్వేమీ కంగారు పడమాకు రా! అని నా వేళ్ళమధ్య నలుగుతున్న ధూమశకటాన్ని లాక్కునేవాడు.మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఆకస్మికంగా ప్రత్యక్షమయ్యేవాడు.పూర్వం లాగానే కొన్ని రోజుల కాలక్షేపం మళ్ళీ మాయం. అలా కొంత కాలం గడిచింది. మళ్ళీ కొన్ని సంవత్స్సరల తర్వాత హైదరాబాద్ లో సిద్దార్థ ఇంట్లో కనిపించాడు. అదో రకంగా నవ్వాడు.

మనిషిలో చాలా మార్పులు వచ్చినట్లు గమనించాను అప్పటికి —-రుచిస్తున్నాడని  తర్వాత తెలిసింది.ఒక ప్రముఖ కవి రహస్య వివాహానికి సాక్షులుగా సిద్దార్థ నేను వెళ్ళాల్సిన తొందర తనంలో గంగాధర్ ని తర్వాత కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాం. అదే ఆఖరి చూపు. సుమారు 15 సంవత్సరాలు గడిచాయి. నామాడి శ్రీధర్ గంగాధర్ గురించి వకాబు చేస్తే అప్పటికే గంగాదర్ ఆత్మహత్య చేసుకొని 4-5 సంవత్సరాలు అయిందని తెలిసింది.తర్వాత ఇంత కాలానికి గంగాధర్ ముద్రిత అముద్రిదత కవితల్ని అతికష్టం మీద సేకరించి అతని కవిత్వాన్ని ‘పత్రశకలంగా’ శ్రీధర్, రమేష్, అనంత్ లు ముద్రించారు. గంగాధర్ కవిత్వం గురించి మరో సారి మాట్లాడుకుందాం…

గంగాధర్ కవితలు కొన్ని …………..  

 

 

 

2
Leave a Reply

avatar
1 Comment threads
1 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
2 Comment authors
P.vidyasagatm s naidu Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
m s naidu
Guest
m s naidu

Heart touching memory. Thank you Iqbal gaaru.

P.vidyasagat
Guest
P.vidyasagat

Fatal gatameppudu