Iqbal Chand's

గుస గుసలు – 1

జీనా యహా! మర్నా యహా!!                                                                 

         ఇది  కేవలం కాలక్షేపం కోసం నా మిత్రుల కోరిక పై రాస్తున్నదే గానీ, పండితుల కోసం గానీ నా పాండిత్యం ప్రదర్శన గానీ కాదని సవినయంగా మనవి. ముందుగా డిజీ ఆర్ట్స్ నిర్వాహకులు సిరాజ్, నౌషాద్ఫరియాజ్, కావ్య, అనిత, సుధ లకు కృతఙ్ఞతలు.

మీకూ నచ్చితే త్రీచీర్స్!!!

 

జగమే మాయ – భరత్ భూషణ్  

హిందీ సినీవినీలాకాశంలో వొ మెరుపు స్టార్ భరత్ భూషణ్. 14-6-1920 న మీరట్ లో పుట్టాడు.

బైజు బావరావంటి సూపర్ హిట్ సినిమా హీరో. ముంబై లోనే కాదు ఇంకా మీరట్ , కోల్కత్తా  వంటి అనేక నగరాల్లో పెద్ద పెద్ద రాజమహల్ వంటి భవంతులు కొన్నాడు. అనేక విదేశీ కార్లు అతని సొంతం . 47 సంవస్సరాల వయసులో రత్న ను వివాహమాడాడు.

సూపర్ స్టార్ హీరో గా రాచమర్యాదలకు లోటు లేదు. ఇంతే ఐతే చెప్పడానికి ఏమి లేదు. మిత్రులారా! భరత్ భూషణ్ కాలం తిరగబడింది. సర్వం కోల్పోయాడు. తినడానికి రొట్టె కూడ దొరకని రోజులు  వచ్చాయి  చివరికి ఏ స్టుడియో లో మహారాజు లా మర్యాదలు సెల్యూట్స్ తో వెళ్ళేవాడో అదే స్టూడియో   కి  తన ఆఖరి రొజుల్లో వాచ్ మెన్ గా పని చేసాడు.

27-1-1992 లో దిక్కులేని చావు అతనిని వరించింది. మున్సిపాలిటి  వాళ్ళు ఖననం చేసారట. 

అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలని పెద్దల ఉవాచ కదా!

నాకు ఇస్టమైన 10 భరత్ భూషణ్ సినిమాలు

  1. చిత్రలేఖ
  2. సుహాగ్ రాత్
  3. బైజు బావరా
  4. ఆనంద్ మఠ్
  5. మీర్జా గాలీబ్
  6. బసంత్ బహూర్
  7. బర్సాత్ కి రాత్
  8. ఉధార్
  9. సాగర్
  10. సావన్

6
Leave a Reply

avatar
5 Comment threads
1 Thread replies
2 Followers
 
Most reacted comment
Hottest comment thread
5 Comment authors
Kavya BM S NaiduAfsarBhutham MuthyaluSiraj Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Kavya B
Guest
Kavya B

true fact for life….

M S Naidu
Guest
M S Naidu

Simply shocking.

Afsar
Guest
Afsar

Thank you so much for writing, Bahadur!

Siraj
Guest
Siraj

Bhai .. how are you, after long time..

Bhutham Muthyalu
Guest

This is true but his death is a mistary.
What a great time in the life what a poor so sad….

Siraj
Guest
Siraj

Nice note with a good message