Iqbal Chand's

తలత్ – నౌషాద్ ల సిగరెట్ మంట

తలత్ – నౌషాద్ ల సిగరెట్ మంట

            1950′ ల్లో హిందీ సినీ వినీలాకాశంలో సంగీత దర్శకుడు “నౌషాద్” ఆడించిందే ఆట, పాడించిందే పాట లా సాగింది. దీనిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అంతకు ముందు ఒకటి రెండు సంవత్సరాల క్రితమే మహా గాయకుడు కె.ఎల్.

K.L.Saigal

సైగల్ తో “షాజహాన్” సినిమాలో పాటలు పాడించాడు. (జబ్ దిల్ హీ టూట్ గయా, అయ్ దిల్ బే ఖరార్ క్యూ వంటి పాటలు ) ఆ పాటలు సూపర్ డూపర్ గా ఇప్పటికీ పాడుకుంటున్నారంటే సైగల్ వాయిస్ తో పాట పాడించిన నౌషాద్ ప్రతిభనూ కాదనలేము.

అప్పటికి ఇంకా మొహమ్మద్ రఫీ గాయకుడిగా పూర్తిగా స్థిరపడలేదు.

అడపా దడపా గా దిలీప్ కు తలత్ పాడేవాడు.

                    
Mohammad Rafi

ఇంతలో నౌషాద్ తనే సినీ నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. 1950లో “బాబుల్” సినిమా తీసాడు. నౌషాద్ ఈ సినిమా కు కథను కూడ అందించాడు. అంటే Story, Music & Producer అన్నమాట.
దిలీప్ కుమార్ పాటల కోసం తలత్ మెహమూద్ తో పాడించాడు.

అయితే పాటల రికార్డింగ్ సమయాల్లోను తలత్ చేతిలో సిగరెట్ ని వదిలే వాడు కాదు. అది నౌషాద్ కు నచ్చలేదు. రికార్డింగ్ థియేటర్ ను సరస్వతి మందిరం గా నౌషాద్ భావించేవాడు. లతా, రఫీలు దాన్ని పాటించారు. ఆ తర్వాత నౌషద్ మలిదశలో గట్టిగానే మందలించాడు.

Hemanth Kumar

అయినా తలత్ సిగరెట్ ను వదల్లేదు. ఈ కారణం చేత నౌషాద్ “బాబుల్” తర్వాత సుమారు 25-30 సంవత్సరాలు తలత్ కు పాట ఇవ్వలేదు. బాబుల్ లో “మిల్ తే హై ఆంఖే ” అనే పాటను ఒరిజినల్ గా తలత్ షంషాద్ బేగంలు పాడారు.

నౌషాద్ ప్రత్యామ్నయం గా హేమంత్ కుమార్, ఉమాదేవి లతో కూడా రికార్డింగ్ చేసాడు. కానీ, నిర్మాతగా ధైర్యం సరిపోలేదేమో ఇగో ని చంపు కొని తలత్, షంషాద్ ల వర్షనే పెట్టాడు.

Uma Devi (Tun Tun)

అలా ఒక్క సిగరెట్టు తలత్, నౌషాద్ ల మధ్య మూడు దశాబ్దాలు మండింది. ఎన్నో పాటలు మిస్ అయ్యాయి.

మిల్తె హీ ఆంఖే (Talath & Shamshad Version)

మిల్తె హీ ఆంఖే (Hemanth Kumar & Tun Tun Version)

1
Leave a Reply

avatar
1 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
1 Comment authors
Krishna prasad Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Krishna prasad
Guest
Krishna prasad

Excellent writeups Iqbal Chand garu.Take a bow.