Iqbal Chand's Review

“మోహధూపం”   

Sameeksha

ఇప్పుడు ఈ కవిత్వమే కావాలి

Mohadhoopam

“బొక్కెన” మాట విని చాలా రోజులయింది. ఈ కవి మళ్ళీ నన్ను ఖమ్మం జిల్లాలోని వో మారుమూల మా పల్లెటూరి బాల్యపు రోజుల్లోకి  తీసుకొని వెళ్ళాడు.

Raghu
రఘు

“శేషభట్టార్ రఘు” కవి. సుకుమారకవి. కొంచెం సుకుమారంగా చెప్పాలంటే లలిత కవి.

   “చలిగాలి లో  బద్దలవుతున్న

నిద్ర వంటి హృదయం నాది

ఇక ఉరుముతున్న గద్దలా

గది ఒడ్డున ఉండ లేను……

…. ….. ….. ….. …… …… ………….

వ్యసనం వంటి వాసన ఏదో

ఉదయాన్ని మంచులా ముంచినప్పుడు

నిమిషాలు బరువెక్కిన బొక్కెనలు”.. .

ప్రొఫయిల్

రఘు ఈ మధ్యనే తన కొత్త కవిత్వాన్ని “మోహధూపం” పేరిట సంపుటీకరించాడు.ఇది రఘు ఆరో సంపుటి.

  1. ఒక స్వాప్నికుడి శ్వేత సంతకం (1997)
  2. సూర్యుడు పొడచిన రాత్రి (1999)
  3. నిద్ర పోయిన మానవ కోయిన (2001)
  4. నేను-కల-వెన్నెల (2008)
  5. లిపి తడిసిన తరుణం (2012)

ఈ సంపుటిలో నాకు నచ్చిన ఒక కవిత “నచ్చలేదు” ఈ నచ్చలేదు అనే క్యరెక్టర్ ప్రతీ ఇంటికి కనీసం ఒకరైనా కనిపిస్తారు.

మరీ ముఖ్యంగా రఘు కవిత్వాన్ని చదువుతున్నంతసేపూ విసుగు అనిపించదు.ఏ వాదాల గొడవలు లేకపోవడం నాకు బాగా నచ్చింది. అందుకే ప్రశాంతంగా మనవాడి గోలని సంతోషంగా  అనుభవించ వచ్చు.

డా||ఎన్ గోపి మాతలో చెప్పలంటే “మోహనధూపం” లో ఏ కవితా ఇదివరకు ఎవరో చెప్పినట్టుండదు. ఎవ్రీథింగ్ ఒరిజినల్ కవర్ పేజీ చాలా ఆకర్షనీయంగా వుంది. ప్రతీ కవితను ఏరి కోరి ఎడిట్ చేసినట్లు అనిపిస్తొంది. అనవసరమైన ఒక్క కవితగానీ, ఒక్క వాక్యంగానీ ఒక్క అక్షరంగానీ కనిపించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఈ కవిత్వమే కావాలి. మిత్రులారా తప్పకుండా చదవండి. రఘు కవిత్వం “మోహధూపం” 

 

For Copies

    

3
Leave a Reply

avatar
3 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
3 Comment authors
PujaNirupama sharmaAkshaya Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Puja
Guest
Puja

Chaala bavundi

Nirupama sharma
Guest
Nirupama sharma

Good review, inka Khammam pai mamakaaram vadalaleda?
Raghu garu congratulations!and. Good luck.

Akshaya
Guest
Akshaya

Good