Uncategorized

సంబరాల సంక్రాంతి……. పతంగీల పండుగ 

Digi Arts Wishes

సంబరాల సంక్రాంతి……. పతంగీల పండుగ  

  సంక్రాంతి పండుగ రాగానే సూర్యుడు మఖర రాశిలో ప్రవేశించాడు అని అర్థం. సంక్రాంతి పండుగను తెలుగు వారు మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని మరియు మూడవ రోజును కనుమ సంక్రాంతి అని అంటారు. 

మొదటి రోజు – భోగి:

Bhogi

ఈ రోజున కుటుంబం లోని పెద్దలూ పిల్లలూ అందరూ కలసి ఉదయం వేళ కొయ్య దుంగలతో రోడ్లపై భోగి మంటలు వేస్తారు. తమ తమ ఇండ్లలోని, పనికిరాని పాత చెక్క వస్తువులను, ఇతర వస్తువులను మంటలలో పడవేసి, పనికిరాని పాతకు స్వస్తి చెప్పి కొత్త దనాన్ని కోరతారు. ఈ చర్య పాత చెడు అలవాట్లని మాని కొత్త మంచి అలవాట్లని చేసుకోవాలని కూడా సూచిస్తుంది.

చాలా కుటుంబాలలో శిశువులకు, పిల్లలకు అంటే సాధారణంగా, మూడు సంవత్సరాల వయసు లోపు వారికి ఒక సాయంకాల వేడుకగా రేగిపండ్లు, పూవులు, చిల్లర నాణేలు కలిపి వారి తలపై పోసి ఆనందిస్తారు. దీనినే భోగి పండ్లు పోయటం అంటారు.

రెండవ రోజు –  సంక్రాంతి:

Sankranthi

ఈ రోజు అందరూ కొత్త దుస్తులు ధరిస్తారు, దేముని పూజిస్తారు, ఈ రోజున సూర్యుడు మకర రాశి లో ప్రవేశిస్తాడు. కనుక దీనిని మకర సంక్రమణం అని కూడా అంటారు. మరణించిన తమ పూర్వీకులకు సాంప్రదాయకంగా కొన్ని కర్మలను ఆచరిస్తారు. ఇంటిలో తయారు చేసిన పిండి వంటలతో కుటుంబ సభ్యులు అందరూ కలసి భోజనాలు చేస్తారు.

మూడవ రోజు – కనుమ సంక్రాంతి:

Kanuma

ఈ రోజు  పశు పక్ష్యాదులను లను గుర్తు చేసుకుంటూ ప్రత్యేకించి ఆవులను, ఎద్దులను పూజిస్తారు. ఈ రోజున ప్రయాణించటం ఆశుభంగా భావిస్తారు. ఈ రకంగా సంక్రాంతి పండుగలో తమ సంప్రదాయ, సాంస్కృతిక విలువలు ప్రదర్శిస్తూ కొత్త మార్పులని ఆచరిస్తారు. గురువులు, తమ శిష్యులను ఆశీర్వదిస్తారు. ఇంటి పెద్ద కుటుంబంలోని సభ్యులకు దుస్తులు అందించి ఆశీర్వదిస్తారు.

ఆంధ్ర రాష్ట్రం లో నాలుగు రోజుల పాటు ఈ పండుగను చేస్తారు. అవి …మొదటి రోజు ‘భోగి’, రెండవ రోజు ‘మకర సంక్రాంతి ‘ (ఇది అసలైన పండుగ రోజు) ,మూడవ రోజు ‘కనుమ’, చివరి రోజు లేదా నాల్గవ రోజు ‘ముక్కనుమ’ గా చెపుతారు
సంక్రాంతి పండుగ మొదటి మూడు రోజులు కోస్తా ఆంధ్ర ప్రాంతం లోని ప్రజలు మాంసం లేదా చేపలు వంటి ఆహారాలు తినరు. కాని మూడవ రోజు అయిన కనుమనాడు మామ్సాహారాలను అధికంగా తింటారు. తెలంగాణా ప్రాంతం లో ఈ పండుగ రెండు రోజులు మాత్రమే చేస్తారు.

పండుగ ప్రత్యేకత – ఆటలు :

Aatalu

దక్షిణ దేశపు ఆటలు అయిన కోడి పందేలు, ఆంధ్ర కోస్తా జిల్లాలలో ఆడగా, తమిళనాడు రాష్ట్రం లో ఎద్దుల పందేలు, కేరళ లో ఏనుగుల మేళా నిర్వహిస్తారు. ఈ పందేలలో చట్టబద్ధం కానప్పటికీ అధిక మొత్తాలలో పందేలు కాయటం ఈ ప్రాంతాలలో ఆనవాయతీగా వస్తోంది.

Aatalu
ఈ పండుగకు హైదరాబాద్, తెలంగాణ జిల్లాలలో పిల్లలు, పెద్దలు కలసి రంగు రంగుల గాలి పటాలు తమ భావనాలపైకి ఎక్కి ఎగుర వేసి ఆనందిస్తారు. ఆంద్ర దేశం తో పాటు, పొరుగునే కల కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఈ పండుగను పొంగల్ పేరుతో ఆచరిస్తాయి.

ఇంతటి విశిష్టమైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! “సంక్రాంతి” లక్ష్మీని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇక ధనుర్మాసము ప్రారంభమైన నాటినుండి వివిధ ఆలయాలలోని అర్చకస్వాములు “సంక్రాంతి” నెలపట్టి సూర్యోదయానికి పూర్వమే మంగళవాయిద్యాలతో నదీజలాలను “తీర్ధంబిందులలో” తోడ్కొని వచ్చి విశేషార్చనలు నిర్వహిస్తారు. ఇంటిముందు కన్నెపిల్లలు కళ్ళాపులు చల్లుతూ! ప్రతిరొజు వివిధ రకాల ముగ్గులతో! సప్తవర్ణాల రంగవల్లికలను తీర్చిదిద్ది “ఇంద్రధనుస్సులను” ముంగిట చూస్తున్నట్లు భ్రమింపచేస్తారు.

 ఇంత చక్కని ఆనందాన్నీ మనకు అందించే “సంక్రాంతి” పండుగలు మనం జరుపుకుని మహారాణిలావచ్చే ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం.    

Wishes

Article Prepared By

Bhadram Kavya

 

Leave a Reply

avatar
  Subscribe  
Notify of