హేమంతం

హేమంతం – A Tribute To Dr. Putla Hemalatha

హేమంతం

A Tribute To Dr.Putla Hemalatha

ప్రముఖ కవయిత్రి,కథకురాలు, భారతదేశంలోనే మొదటి మహిళా వెబ్ పత్రిక ‘విహంగ’ వ్యవస్థాపకురాలు

డిజిప్లానెట్ సహ వ్యవస్థాపకురాలు డా.పుట్ల హేమలత గారు ఆకస్మికంగా అకాల మరణం పొందారని తెలియజేయడానికి మాకు భాష పలకడం లేదు. డిజిప్లానెట్ లోనే అనుబంధంగా ‘డిజిఆర్ట్స్’ ను డా.ఇక్బాల్ చంద్ తో కలిసి రూపకల్పన చేశారు. తెలుగు కళాకారులు అందరినీ  ఒకే వేదికపైకి తీసుకొనివచ్చి  వారి రచనలను డిజిటలైజ్ చేసే ఆలోచనలో గత రెండు సంత్సరాలుగా అవిశ్రాంతంగా పనిచేసారు.

సంస్థాపరం గా మా లోటు ఎలానూ తీర్చలేనిదే. కాని, వ్యక్తిగతంగా హేమలత గారితో అతి తక్కవ సమయంలో ఏర్పడిన అనుబంధం స్నేహపూర్వకమైననదే కాదు, మమ్మల్ని ఎంతో సన్నిహితురాలు గా చేసింది. హేమలత గారి తో మేము చాలా తక్కువ సమయం మాత్రమే గడిపాం కానీ ఆమె చూపిన ప్రేమ, ఆదరణ,కరుణ విలువ లేనిది. మరెవరినుంచి ఆశించలేనిది.

     ఎంతో సున్నితంగా వ్యవహారశైలి ఉన్నప్పటికీ అభిప్రాయాల విషయంలో చాలా బలంగా వుండేవారు. హేమలత గారు మరణించారు అన్న వార్త మేం ఎప్పటీకీ జీర్ణించుకోలేము. ఆమె కుర్చీని అలానే మేం ఖాళీగా శాశ్వతంగా ఉంచుతున్నాం.హేమలత గారి కుర్చీని, స్థాయినీ,స్థానాన్ని మరెవరితోనూ పూరించదలచలేదు.

డిజి ఆర్ట్స్ లో ఆమె రెగ్యులర్ గా ‘హేమంతం’ శీర్షికతో ఒక కాలం రాయదల్చుకొన్నారు.మొదలు కాక ముందే హేమ అంతం అయినారు. ‘హేమంతం’ పేరుతో మేము ఒక వెర్టికల్ ను ఆమెకు జ్ఞాపికగా ప్రారంభించాం. హేమగారి జ్ఞాపకాలను పంచుకో దలిచిన వారు , తమ రచనలు ఇలా ఇక్కడ ప్రకంటించుకొనే వీలు  కల్పిస్తున్నాం.

హేమగారు లేని లోటు ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారికి, మానస, బింగూలకు ఎలాను వుంటుంది. అది తీరని నష్టం. ఈ ఖాళీ పూరించలేనిది. ఈ ఖాళీ తనం వారికే కాదు మీకు మాకు కూడా.

హేమలత జోహర్!

హేమలత అమర్ రహె!!

హేమలత జిందాబాద్!!

డిజి ఆర్ట్స్ టీమ్

సిరాజ్, నౌషాద్, ఫరియాజ్,

అనిత, సుధ, సంపత్, రూయల్,

 అహ్మద్, సురేష్, రోహిని

14
Leave a Reply

avatar
14 Comment threads
0 Thread replies
1 Followers
 
Most reacted comment
Hottest comment thread
10 Comment authors
Mercyఎండ్లూరి సుధాకర్అరుణాంక్ లతBhandaru vijayaSudha Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Mercy
Guest
Mercy

Missing you a lot aunty .. I dont have words to tell you how much i am missing you.

ఎండ్లూరి సుధాకర్
Guest
ఎండ్లూరి సుధాకర్

నువ్వులేని ప్రేమికుల దినం

నా బంగారు తీగా!
నా ఏకాంతంలో
ఒక అంకెను మాత్రమే
నీ పక్కన చేరాకే
నేను రెండుగా మారాను
నీతో నిండుగా జీవించాను
నీ సాంగత్యంలో
వసంతమే తప్ప
ఆకురాలు కాలంలేదు
నువ్వు ఏ లోకపు దేవతవో
నా కోసం పుట్టిన ఈ కాలపు వనితవో
నా వంశ వృక్షానికి
రెండు గర్భఫలాలనిచ్చావు
నేను నీ చుట్టూ తిరిగానో
నువ్వు నా చుట్టూ పరిభ్రమించావో
ఈ భూమండలం మీద
దాంపత్యపు జంట చీమలమయ్యాo
నవరసాలు కలిసిన
తొలికారు పంట ప్రేమలమయ్యాo
జీవితం అనుక్షణం రసమయం కాదు
సంసార సాగర మథన విషమయం కూడా
ఒక దుఃఖపు మబ్బుల మధ్య
అర్ధాకాశంలోంచి రెప్పపాటులో
నక్షత్రంలా రాలిపోయావు
భళ్ళున గాజు పాత్రలా పగిలిపోయావు
అర్ధ దేహంతో శూన్యంగా మిగిలిపోయాను
పశ్చాత్తాప వీణ మీద
క్షమారాగం ఆలపించే అవకాశం లేదు
మట్టిపెట్టెలో నువ్వు
ఒంటరి మంచంలో నేను
నా కలత నిద్రలో
నా గుండె పక్కన పడుకుంటావు
నేను కళ్ళు తెరిచినప్పుడు
వేకువరాగంలా మేలుకొoటావు
నిజానికి నువ్వు నాలోనే వున్నావు
నువ్వు విడిచిపెట్టిన చెప్పుల్ని
రహస్యంగా ముద్దుపెట్టుకుంటున్నా
తోలువాసన కాదు
ఈ చర్మకారుడికి
ప్రేమ వాసన గుభాళిస్తోంది

-ఎండ్లూరి సుధాకర్
8500192771
(9-2-2019 నాడుతిరిగిరాని లోకానికి వెళ్లిపోయిన నా జీవన సహచరి డా. పుట్ల హేమలత స్మృతిలో)

అరుణాంక్ లత
Guest
అరుణాంక్ లత

|| హేమంతం ||
― అరుణాంక్ లత

అమ్మకి
అక్కకీ మధ్య
సన్ననిగీత తాను

లోతైన మనసు
విశాలమైన నవ్వు
అచ్చం చివరిసారి
కలిసిన సంద్రంలా

పుట్టుబడే ఎజెండాగా తప్ప
ఏ జెండాలు లేని
బతుకె ధిక్కారమైన
నిలువెత్తు అమ్మ రూపం

చల్లగాలులు వీస్తూ
మంచుకురిసే
హేమంతం

ఇప్పుడిక
రుతువులు ఆగిపోయాయి
‘హేమ’అంతం తోనే

మాదిక
కొత్త రుతువు
అమ్మలేని
అక్కలేని
దుఃఖ రుతువు

అక్కా
నీ యాదుల్ని కలబోసుకునే
వలపోతల రుతువు

Bhandaru vijaya
Guest
Bhandaru vijaya

We miss you my dear friend

Sudha
Guest
Sudha

We really miss you hema Latha Garu..we cannot forgot those days which we spend …such a nice and great person we met…I don’t believe that Hema Latha Garu is no more…We really miss u…madam…

Akshaya
Guest
Akshaya

R.I.P
Return If Possible

Vijay kumar
Guest
Vijay kumar

Rest in peace 🙏🏼😢

Seela Subhadra devi
Guest
Seela Subhadra devi

హేమంతం శీర్షిక ని హేమలత ప్రారంభించకుండానే హేమ అనంతదూరానికి వెళ్లిపోవటం విషాదకరం.ముఖ్యం గా అంతర్జాలంపై చేసినపరిశోధనలోఅనేకవిషయాలు చర్చించినవిధం చాలామందికి ఉపయోగకరం.అత్మీయమైన చిరునవ్వుతో పలకరించె హేమలతని ఆమెని తెలిసిన వారెవ్వరూ మరువలేరు.అందుకే సాహిత్యరంగానికేకాక ప్రరవే కి మితృలకి ఈలోటు తీర్చలేనిది.ఎండ్లూరి సుధాకర్ గారికి,మానస,మనోజ్నలకు మా ప్రగాఢ సానుభూతి.

Praveen
Guest
Praveen

Rest in peace 😢

Kavya
Guest
Kavya

That day we spend it’s my memorable day…. I gone miss memorable days in future with you Madam …I miss you Hema Latha madam….Rest in Peace

Suhasini
Guest

I love you Hema ;we all miss you …suhas.

Anitha
Guest
Anitha

She is very friendly person and Really I miss her
Rest In Peace 😰😢

Venkateswara rao k
Guest
Venkateswara rao k

మా కవితామ తల్లి
మమతల వల్లీ
సద్గుణాల కల్పవల్లి
సుగుణాలరాశి
సకలకళా వల్లభురాలు
నీవులేవని ఎవరన్నారమ్మా..!
తెలుగు సాహితీలోకంలో
విహంగ వై విహరిస్తూ ఉన్నావుగా
నా తల్లీ….
నువ్వు వదిలివెళ్లిన జ్ఞాపకాలను
తలచుకుంటూ ముందుకు సాగుతూ
ఈ తెలుగు సాహితీ జగత్తు లో
హేమంతం కాదు హిమవంతమైన
నీ చల్లని చిరునవ్వును సాహిత్యాన్ని
దశదిశలా వ్యాపిస్తామమ్మా……
సాధిస్తామమ్మా….
అమర్ రహే హేమలతమ్మా…

Sampath
Guest
Sampath

We miss a good person