Akshara Dandiyathra

తెలుగు నేలపై

అక్షర యోధులనుకున్న

గులాంగిరి గాళ్లు

గడీల గోడలకు

సున్నాలేసే పనిలో నిమగ్నమైనప్పుడు

అక్షరాలు కక్షతో రగిలిపోతున్నాయ్..!

అక్షరాలకు మాటలు

నేర్పిన మహాకవి శ్రీ శ్రీ లా

అక్షరాలను ఆయుధాలుగా

మల్చిన చెరబండరాజులా,

ధిక్కారానికి దిక్సూచి

కలేకూరి ఆత్మగౌరవంలా,

అక్షరానికి ఆత్మగౌరవం

నేర్పిన

అలిశెట్టి ప్రభాకరుడి

ప్రతిఘటన నినాదంలా,

నయా మనువాద శిభిరంపై

యుద్ధం ప్రకటించిన

మహాత్మా జ్యోతి బా, బాబాసాహెబ్ ల

నిజమైన వారసుడు

మారోజు వీరన్నలా

అక్షరాలన్ని గరీబోడి గడపలో

నిలబడి గాండ్రిస్తున్నాయ్…!!

శంభూక్ వధ రాజనీతి శాస్త్రాన్ని

భీమా కోరేగావ్

అమరవీరుల స్మారకస్థూపానికి దిష్టి

బొమ్మను చేసిన

బహుజన రాజనీతి

శాస్త్రవేత్త

మాన్య శ్రీ కాన్షీరాంలా,

ఆత్మ గౌరవం,సామాజిక న్యాయ పోరాటాన్ని కబ్జా చేయ ప్రయత్నిస్తున్న మడి,దడి గాళ్ళ కుట్రలను

పసిగట్టమని హెచ్చరిస్తున్నాయ్‌‌..!!!

పాతిపెట్టబడిన

శ్రామిక బహుజన

చరిత్రను

తవ్వితీయమని

అక్షరాలన్ని చరిత్ర నిర్మాతల

వారసుడైన గరిబోడి

గడపలో నిలబడి

తిరుగుబాటుకు పిలుపునిస్తున్నాయ్…!!!

సుద్దాల హనుమంతుడి

సుద్దుల్లా,

పెట్టికోట అల్వార్ అగ్గిమంటలా,

కొమురం భీం విల్లంబులా,

గూడ అంజన్న గుండె

మంటలా,

కరీంనగర్ దొరతనంపై తొడగొట్టిన

కొదురుపాక రాజవ్వ

సమర నినాదంలా,

తెలంగాణ తెగువలా,

మన్యం అల్లూరిలా,

రాయలసీమ

పరిటాల శ్రీ రాములు

నెత్తుటి ధారలా

అక్షరాలన్ని తిరుగుబాటుకై

సైయ్యంటున్నాయ్..!

మట్టి మనుషుల ఎట్టిబతుకుల నుండి

విముక్తి చేసిన

ఆ అక్షరాలు కనుమరుగై పోతే చరిత్ర క్షమించదని వేడుకుంటున్నాయ్…!!

అది చరిత్ర చలనశీలతకు

మానవ సమాజ

పరిణామ క్రమానికి విరుధ్దమైన సామాజిక రుగ్మత లాంటిదని

ఆవేదన చెందుతున్నాయ్…!!!

అంటరాని అక్షరాలన్ని

సంఘమొకటిబెట్టాలని

నమ్ముకున్నోల్లను

అమ్ముతున్న బద్మాష్ గాళ్ల

గల్లాపట్టి నిలదీయాలని

అక్షరాలన్ని తిరుగుబాటుకు

సిద్ధమవుతున్నాయ్…

★★★**

అక్షర దండియాత్ర✍

12-10-2018

3
Leave a Reply

avatar
3 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
3 Comment authors
రావులపాటి రత్న కుమారిThadikamalla David KumarAnitha Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Anitha
Guest
Anitha

This is really perfect poem written perfectly…You are an awesome poet… Thank you VENKAT sir..

Thadikamalla David Kumar
Guest
Thadikamalla David Kumar

నీ పదాలు
సానబట్టిన ఆకురాయి కొడవళ్లు
సింధునాగరికత
ఓ నా మూలరత్నమా
నీ ఆత్మ గౌరవ పతాక
అంబరాన్నీ కంభలించిన
నీలి జెండా రా
జై భీం జై ఇండియా
Thadikamalla David Kumar

రావులపాటి రత్న కుమారి
Guest
రావులపాటి రత్న కుమారి

kavita bavundi