Digi Arts Wishes

సంబరాల సంక్రాంతి……. పతంగీల పండుగ 

Posted Leave a commentPosted in Uncategorized

సంబరాల సంక్రాంతి……. పతంగీల పండుగ     సంక్రాంతి పండుగ రాగానే సూర్యుడు మఖర రాశిలో ప్రవేశించాడు అని అర్థం. సంక్రాంతి పండుగను తెలుగు వారు మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని మరియు మూడవ రోజును కనుమ సంక్రాంతి అని అంటారు.  మొదటి రోజు – భోగి: ఈ రోజున కుటుంబం లోని పెద్దలూ పిల్లలూ అందరూ కలసి ఉదయం వేళ కొయ్య దుంగలతో రోడ్లపై భోగి మంటలు […]

Star Of The Month

Posted 10 CommentsPosted in Uncategorized

ఈ నెల తార   ప్రముఖ కవయిత్రి, పరిశోధకురాలు డా. పుట్ల హేమలత Dr.PUTLA HEMALATHA  is an Instructor at Potti Sree Ramulu Telugu University. Rajahmundry, AP, India. She has a Ph.D in Telugu Literature on Internet. Beside teaching. She is Constantly working towards motivating writers across the globle to write in Telugu. As the Editor of the first […]

Prathi Roju Aame Oka Sooryodayam

Posted 4 CommentsPosted in Uncategorized

ప్రతీరోజు ఆమె ఒక సూర్యోదయం ————————————— పొద్దు పొద్దున్నే ఆమె నా ముందు వెచ్చని తేనీరవుతోంది గుమ్మం ముందు వాలిన పేపర్ వైపు నా రెండు కళ్లూ సారిస్తానా… పత్రికలో ఆమె పదునైన అక్షరాల కొడవలి మెరుగైన లక్షణాల పిడికిలి కన్నీళ్లు కాటుక కళ్లల్లో దాచుకొని కమ్మని వంటల విందవుతోంది కాలం కదిలిపోవాలికదా అంటూ.. రాజీ తుపాకిని ఎత్తుకున్న సిపాయవుతోంది లోపలి మనిషి బయటి మనిషీ అంటూ సెటైర్ల సాహిత్య సివంగవుతోంది ఆమె నాకు పాఠమో నేను […]

పంటర్

Posted 11 CommentsPosted in Uncategorized

  1 రాత్రి వొక అరణ్యం పగలు వొక జూదశాల, ఉన్న ప్రపంచాన్ని వొదిలి లేని మరో ప్రపంచం కోసం యాత్ర – వొక్కటంటే వొక్కటే మంచి నీటి చుక్క కోసం నడి సముద్రం లొకి దూకి వెతుకులాట – 2 పడవ నడిపే పని దొరికాక ఇక ప్రాణాలపై భయం తేలిపోయిన మబ్బుల్తొని  లేచిపోయింది – 3 కేవలం బ్రెడ్ అండ్ బట్టర్ కోసమే అయితే ఎలాగైనా బతిని చావొచ్చు – చనించాక కూడా బతకడానికే […]

Chudu-Chudu-Chudu

Posted 2 CommentsPosted in Uncategorized

చూడు..చూడు..చూడూ..! ——————————— గగనంలోని పక్షిని చూడు భువనంలోని అక్షిని చూడు ఆకలి మంటల కేకలు చూడు లోపలి గంటల పిలుపులు చూడు బాధల అరుపుల దరువులు చూడు గాధల పిలుపుల బరువులు చూడు ఆశల పల్లకి బోయిని చూడు కదలక నిలిచిన రాయిని చూడు కిసాను ఎత్తిన నాగలి చూడు జవాను చుట్టిన పిడికిలి చూడు అమ్మానాన్నల అశ్రువు చూడు కన్నీరెత్తిన క్రోధం చూడు పాడి పశువుల కతలను చూడు గాడి తప్పిన వెతలను చూడు మానవ […]

Koti Gontula Bavuta – Kotukojwala Ramesh

Posted 24 CommentsPosted in Uncategorized

కోటిగొంతుల బావుట..! ———- —————– బతుకమ్మ అంటే.. బతుకును నేర్పిన ఉద్యమం బతుకమ్మ అంటే.. భవితను పేర్చిన సంగమం దొరల పెత్తనాన్ని దునిమడిన జానపదం అడవి తల్లి ఆకాంక్షగ కదలాడిన పూలరథం నీళ్లులేని తెలంగాణలో క ‘న్నీటి’ చెలిమె బతుకమ్మ కాయ కష్టం లో ఆత్మీయ చెలిమ బతుకమ్మ ఆశయ చెలిమి బతుకమ్మ పని పాటల జమిలి బ్రతుకు పాటల బలిమి రగిలే విప్లవ కొలిమి చైతన్యపు కలిమి బతుకమ్మ బతుకమ్మ అంటే.. తనను తాను తవ్వి […]

అక్షర దండియాత్ర

Posted Leave a commentPosted in Uncategorized

తెలుగు నేలపై అక్షర యోధులనుకున్న గులాంగిరి గాళ్లు గడీల గోడలకు సున్నాలేసే పనిలో నిమగ్నమైనప్పుడు అక్షరాలు కక్షతో రగిలిపోతున్నాయ్..! అక్షరాలకు మాటలు నేర్పిన మహాకవి శ్రీ శ్రీ లా అక్షరాలను ఆయుధాలుగా మల్చిన చెరబండరాజులా, ధిక్కారానికి దిక్సూచి కలేకూరి ఆత్మగౌరవంలా, అక్షరానికి ఆత్మగౌరవం నేర్పిన అలిశెట్టి ప్రభాకరుడి ప్రతిఘటన నినాదంలా, నయా మనువాద శిభిరంపై యుద్ధం ప్రకటించిన మహాత్మా జ్యోతి బా, బాబాసాహెబ్ ల నిజమైన వారసుడు మారోజు వీరన్నలా అక్షరాలన్ని గరీబోడి గడపలో నిలబడి గాండ్రిస్తున్నాయ్…!! […]