Chudu-Chudu-Chudu

Katukojwala Ramesh

చూడు..చూడు..చూడూ..!
———————————
గగనంలోని పక్షిని చూడు
భువనంలోని అక్షిని చూడు

ఆకలి మంటల కేకలు చూడు
లోపలి గంటల పిలుపులు చూడు

బాధల అరుపుల దరువులు చూడు
గాధల పిలుపుల బరువులు చూడు

ఆశల పల్లకి బోయిని చూడు
కదలక నిలిచిన రాయిని చూడు

కిసాను ఎత్తిన నాగలి చూడు
జవాను చుట్టిన పిడికిలి చూడు

అమ్మానాన్నల అశ్రువు చూడు
కన్నీరెత్తిన క్రోధం చూడు

పాడి పశువుల కతలను చూడు
గాడి తప్పిన వెతలను చూడు

మానవ మృగాల మర్మం చూడు
దానవ ధృవాల ధర్మం చూడు

సల సల మరిగే భుక్తిని చూడు
బిర బిర ఉరికే శక్తిని చూడు

కదన రంగంలో కాళిని చూడు
కణ కణ మండే కొలిమిని చూడు

పైరు పచ్చని ప్రేమను చూడు
పట పట రాలే ద్వేషం చూడు

రాజీ పడనీ నీతిని చూడు
రజ్యమేలని జాతిని చూడు

మునక తెలవని పడవను చూడు
స్వాగత గీతపు గడపని చూడు

నీలో రగిలే నిప్పును చూడు
మాలో మెదిలే ముప్పును చూడు

రాజతంత్రపు పోటును చూడు
ప్రజాతంత్రపు ఓటును చూడు

సాగర జీవన సమరం చూడు
ఆటుపోటుల అమరం చూడు

వేదం చూడు నాదం చూడు
మిల మిల మెరిసే మెరుపును చూడు

భవితను చూడు కవితను చూడు
గలగల పారే ఏరును చూడు

రాజును చూడు తరాజును చూడు
గంతలు కట్టిన న్యాయం చూడు

చట్టం చూడు చుట్టం చూడు
భవబంధాల బాధ్యత చూడు

స్వేచ్ఛను చూడు యధేచ్ఛను చూడు
నీలో చేరిన మచ్చను చూడు

ముసిముసి నవ్వుల ముచ్చట చూడు
ముదములె లేని బ్రతుకులు చూడు

మనిషిని చూడు మనసుని చూడు
మానవత్వపు మహిమను చూడు
————————————-

-కటుకోఝ్వల రమేష్

2
Leave a Reply

avatar
2 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
2 Comment authors
T.David kumarvekat Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
vekat
Guest
vekat

కవిత చాలా చాలా బావుంది సార్!

వెంకట్

T.David kumar
Guest
T.David kumar

మనిషిని చూడు మనసుని చూడు
మానవత్వపు మహిమను చూడు
చాలా బాగా చెప్పారు.కవి గారికి వందనాలు.
డేవిడ్ కుమార్