Uncategorized

Happy Birthday To Afsar Mohammad

హ్యాపీ బర్త్ డే భాయ్!!!!

మా అమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ అమ్మ …. వీళ్ళందరూ  అఫ్సర్ పేరు వచ్చినప్పుడల్లా యే యేడు పుట్టాడో చెప్పరు.
నెహ్రూ  మరణించిన ఏడని అలాగే కన్నాంబ చనిపోయిన యేడు పుట్టాడు అని అంటుంటారు.అంటున్నారు.అలాగే అంటారు కూడా . వాళ్ళ అమ్మ కూడా అలాగే గుర్తుంచుకొంటుంది. వాళ్ళ నాన్న మా నాన్న ,పెద నాన్నలు అయితే మదర్ ఇండియా డైరెక్టర్ పోయిన సంవత్సరం అఫ్సర్ పుట్టాడు అని అనుకొనేవారు.  
ఆ రోజుల్లో మా అటూ ఇటూ ఇంటి వాళ్ళ పిల్లాల్లో బుద్దిమంతుడు  అఫ్సర్ ని ఉదహరించేవాళ్ళు.   బ్యాడ్ బోయ్ ని నేనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు లేండి.
నాకు గుర్తు  ఎరిగి రోజుకి 14-16 గంటలు పుస్తకాలు చదివేవాడు.మా పెద్దవాళ్ళు మమ్మల్ని తిట్టడానికి కావల్సినంత సరుకుని అఫ్సర్ అప్రయత్నంగా అందిచ్చేవాడు.వాడిని చూడరా …   చూసి నేర్చుకోండి రా  … చదవండి రా … అని మాకు అక్షింతలు  పడేవి.
అఫ్సర్ లా  మమ్మల్ని  ఉండమనే వాళ్ళూ.
మేము ఇంకొంత చెడిపోవడానికి దారులు వెతికే వాళ్ళం.
అఫ్సర్ మాకు పెద్ద  దిక్కు.అప్పటికి .. ఇప్పటికి.. ఎప్పటీకి…
అక్కడ వున్నా ! ఇక్కడ వున్నా!  
అఫ్సర్ వంటీ మేనమామ అన్నగా నాకు దొరకడం నా జీవితానికి వొక ముందుమాట .
హ్యాపీ బర్త్ డే  భాయి !!!

1
Leave a Reply

avatar
1 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
1 Comment authors
Siraj Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Siraj
Guest
Siraj

Happy birthday bhai🎂🎂