Uncategorized

Happy Ugadi

DPTS Ugadi Wishes

ఉగాది శుభాకాంక్షలు

యుగానికి పండగ ఉగాది. దీనిని సంవత్సరాది అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఆదిగా జరుపుకునే ఉగాది పండుగను తెలుగు వారు జరుపుకుంటారు. చాంద్రమానాన్ని అనుసరించి చైత్రమాస శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాది పండుగగా పరిగణిస్తారు. వసంత ఋతువు కావటం చేత పకృతిలో ఉన్న చెట్లన్ని కొత్త లేత చిగుళ్లతో, పూల పరిమళాలతో పచ్చగా కళకళ లాడుతూ శోభాయమానంగా కనిపించే సుందర దృష్యాలను చూసి కోయిలలు పులకరించి మన వీనులకు విందు కలిగించే కమ్మని స్వరాలతో ఆనందింప జేస్తాయి.

ఈ పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పిల్లలు,పెద్దలు శాస్త్ర విధిగా తలంటు స్నానం,నువ్వు పిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. నుదుట బొట్టును పెట్టుకుని, కొత్త బట్టలు వేసుకుని తరువాత భగవంతుడిని పూజించాలి. పూజ అయిన తరువాత పెద్దల దీవెనలను పొందడం, పంచాంగశ్రవణం, దేవాలయాల సందర్శనం చేస్తే పుణ్యఫలాలు కలుగుతాయి.
ఉగాది రోజు ప్రత్యేకం పచ్చడి. ప్రకృతి నుండి అప్పుడప్పుడే కొత్తగా వచ్చే కాయలు, పూతలు వీటి ద్వార చేసేవి
1) వేప పువ్వు “చేదు”
2) మామిడి “వగరు”
3) కొత్త బెల్లం “తీపి”
4) కొత్త చింతపండు “పులుపు”
5) పచ్చి మిర్చి “కారం”
6) ఉప్పు “కటువు”

DPTS Ugadi Wishes

ఈ షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడిని ముందుగా దేవుని ముందు నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత పరిగడుపున తినడం జరుగుతుంది. ఈ ప్రకియంతా శ్రద్ధగా గమనిస్తే ఈ కాలంలో వచ్చే కాయలను పండ్లను తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనకు శాస్త్రాలు సూచిస్తున్నాయి. తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజు అన్ని రకాల రుచులను సమభావదృష్టి గ్రహించే పరమార్ధం ఏమిటంటే మానవుడు తన జీవితంలోని సుఖదుఖాలను, మంచి,చెడులను సంతోషంగా ఎదుర్కోవాలి అని. మనిషికి కష్టం కలిగినపుడు కృంగక, మంచి జరిగినపుడు గర్వపడక రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ జీవితం సాగించాలని భావం.

ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం వినడం ఆంతర్యం ఎమిటంటే ఉగాది అనేది చైత్రశుద్ధ పాడ్యమితో ప్రారంభం అవుతుంది. ఖగోళంలో ఉన్న గ్రహాల స్థాన ప్రభావ ఫలితంగా మన మహర్షులు తెలిపిన ప్రకారం పన్నెండు రాశులు, 27 నక్షత్రాలను ప్రామాణికంగా తీసుకొని కాల గణనం చేస్తూ వస్తున్నాము.

Leave a Reply

avatar
  Subscribe  
Notify of