Koti Gontula Bavuta – Kotukojwala Ramesh

Bathukamma

కోటిగొంతుల బావుట..!
———- —————–
బతుకమ్మ అంటే..
బతుకును నేర్పిన ఉద్యమం
బతుకమ్మ అంటే..
భవితను పేర్చిన సంగమం
దొరల పెత్తనాన్ని
దునిమడిన జానపదం
అడవి తల్లి ఆకాంక్షగ
కదలాడిన పూలరథం

నీళ్లులేని తెలంగాణలో
క ‘న్నీటి’ చెలిమె బతుకమ్మ
కాయ కష్టం లో
ఆత్మీయ చెలిమ బతుకమ్మ
ఆశయ చెలిమి బతుకమ్మ
పని పాటల జమిలి
బ్రతుకు పాటల బలిమి
రగిలే విప్లవ కొలిమి
చైతన్యపు కలిమి బతుకమ్మ

బతుకమ్మ అంటే..
తనను తాను తవ్వి పోసుకున్న పాట
ఒక తలపోత..ఒక వల పోత
విజయ గాధల పూల పోత
తరతరాల జీవన వెత
పరిపరి విధాల
పరివ్యాప్తమైన పల్లేపాట
తొమ్మిది రోజుల మేళవింపై
శిఖరమెత్తిన సద్దుల ఆట
ఆడపడుచుల ఆత్మగౌరవ తోట
బ్రతుకు పోరును పరిచిన
సామూహిక సజీవ బాట

చిమ్మని చీకట్లలో
పూల వెలుగు బతుకమ్మ
ముగ్గుల వాకిట్లలో
స్వేచ్ఛ పులుగు బతుకమ్మ
విజయగాధల ఆస్థీ
సంస్కృతికి తొలి కిస్తీ
ఆడపడుచుల దోస్తీ
సూర్యోదయాల సొగసరి
తెలంగాణ ఘీంకార కరి
ఉద్యమాల ఊపిరి
ఊయల పాటల ఝరి బతుకమ్మ

కోలాటాల సవ్వడిలో
సమైక్య జీవన గీతిక
సమిష్టి భావన పతాక
సాంస్కృతిక మూలాల అస్తిత్వం
సాంప్రదాయ పూమాలల తత్వం
కథన రంగపు కోట..ధీరత్వ మాట
ప్రకృతి ఒడిలో పురివిప్పిన పూదోట
వేల పాటల ఊట
కోటి గొంతుల బావుట బతుకమ్మ..!

24
Leave a Reply

avatar
12 Comment threads
12 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
12 Comment authors
శ్రీపాద రామలక్ష్మిరావులపాటి రత్న కుమారిRamesh katukojwalaButham MuthyaluNaushad Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
sv lakshmi
Guest
sv lakshmi

kavita chaala bbavundi

Ramesh katukojwala
Guest
Ramesh katukojwala

Thanq andi…

ragam srinivasa rao
Guest
ragam srinivasa rao

batukamma batukamma uyyalo …. Thanks sir … very nice poem

Ramesh katukojwala
Guest
Ramesh katukojwala

.ragam……thanam…..pallavi…
Thanq ji

mohan rao kokirala
Guest
mohan rao kokirala

great poem, happy dasara sir,

Ramesh katukojwala
Guest
Ramesh katukojwala

Thanq…wish u the same

mohan rao kokirala
Guest
mohan rao kokirala

wow…

Ramesh katukojwala
Guest
Ramesh katukojwala

Tq….💐💐

mohan rao kokirala
Guest
mohan rao kokirala

wow … what a poem

Ramesh katukojwala
Guest
Ramesh katukojwala

Tq Mohan ji

Anandarao
Guest
Anandarao

kavita baavundi, photo kooda adirindi

Ramesh katukojwala
Guest
Ramesh katukojwala

Tqqqqqqqq

krishna kumari
Guest
krishna kumari

good poem, batkamma batukamma noorellu

Ramesh katukojwala
Guest
Ramesh katukojwala

Thanq andi

David
Guest
David

chala chaala bavundi kavita

Ramesh katukojwala
Guest
Ramesh katukojwala

Tq…mitrama

varaprasad
Guest
varaprasad

chala chaalaa bavundi mee kavita Ramesh Garu… thanks …..

Ramesh katukojwala
Guest
Ramesh katukojwala

Tq…varaprasad garu

Naushad
Guest
Naushad

Nice Poem…

Butham Muthyalu
Guest
Butham Muthyalu

Nice poem

Ramesh katukojwala
Guest
Ramesh katukojwala

Thanq…ji

Ramesh katukojwala
Guest
Ramesh katukojwala

Tq..💐

రావులపాటి రత్న కుమారి
Guest
రావులపాటి రత్న కుమారి

కవి గారికి నమస్తె !

కవిత బావుంది. మరిన్ని కవితలు అందించండి.
–రత్న

శ్రీపాద రామలక్ష్మి
Guest
శ్రీపాద రామలక్ష్మి

super poem sir, congrats….