Nenu [Kavita]- Sri Nagastram

నేను { కవిత }…శ్రీ నాగాస్త్ర్ 7013939600

నన్ను
కొందరు
యోగి భోగి
రోగి త్యాగి
అన్నారు

ఇంకొందరు
సామ్యవాది విప్లవవాది
తీవ్రవాది ప్రజావాది
భావవాది భావివాది
ఉన్మాది న్యాయవాది
అన్నారు

మరికొందరు
రక్షకుడు రసికుడు
భక్షకుడు భిక్షకుడు
రుద్రుడు భద్రుడు
యోధుడు భీతుడు
సేవకుడు స్వార్ధపరుడు
నాయకుడు సైనికుడు
అన్నారు

ఎవరికి తెలుసు
నాలో
వేదనలెప్పుడు రగులుతాయో
ప్రేమెప్పుడు వర్షిస్తుందో
మృగత్వమెప్పుడు వేటాడుతుందో
అహంకారమెప్పుడు మేల్కొంటుందో
ఆవేశమెప్పుడు ఘర్జిస్తుందో
మానవత్వమెప్పుడు చేతులు చాస్తుందో

నా
విరోధులకు కొంత తెలుసు
సహచరులకు ఇంకొంత తెలుసు
కుటుంబస్తులకు మరికొంత తెలుసు
ఎవరికి తెలుసు నా పరిపూర్ణత
నన్ను వెంబడిస్తూ నన్నంటి ఉండే
నీడ, కొన్నిసార్లు లెక్క తప్పుతోంది

మరి ఎవరికి తెలుసు
నా గురించి
నాలో లోలో మనిషి గురించి
నాలో మనిషిలోని భిన్న రూపాల గురించి
ఈ లోకంలో
ఎవ్వరికి, ఎప్పటికి తెలియదు

నేను వేసే ప్రతి అడుగు
ఎడారి
ఉద్యానము
అగాధజలం
అగ్నిహోత్రం
గాడాంధకారలోయ
బృందావనం
ఎటువైపో
తెలుస్తుంది

ఒక్క నా మనసాక్షికే

2
Leave a Reply

avatar
2 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
2 Comment authors
KavyaAmira Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Amira
Guest
Amira

Its really nice

Kavya
Guest
Kavya

Nice poetry