పంటర్

 

1

రాత్రి వొక అరణ్యం

పగలు వొక జూదశాల,

ఉన్న ప్రపంచాన్ని వొదిలి

లేని మరో ప్రపంచం కోసం యాత్ర –

వొక్కటంటే వొక్కటే

మంచి నీటి చుక్క కోసం

నడి సముద్రం లొకి దూకి వెతుకులాట –

2

పడవ నడిపే పని దొరికాక

ఇక ప్రాణాలపై భయం

తేలిపోయిన మబ్బుల్తొని  లేచిపోయింది –

3

కేవలం బ్రెడ్ అండ్ బట్టర్ కోసమే అయితే

ఎలాగైనా బతిని చావొచ్చు –

చనించాక కూడా బతకడానికే

సన సన్నటి గాలి లోని తీగపై అవిశ్రాంత నర్తనం –

తొంభై తొమ్మిది శాతం జారి బండరాయి పై పడి

తల పగిలే అవకాశమే  ఎక్కువ

అయినా

వొక్క శాతం అద్దరికి చేరి మీసం మెలేయడానికే

కళ్ళు మూసుకోని కూడా వొప్పుకుంటాను –

4

వొకేసారి పోవాలి

అదీ పోతూ పోతూ

ముళ్ళను బహూకరించే కాలం మొహమ్మీద

పరిహసిస్తూ వెక్కిరించి

చెప్పపెట్టకుండా

ఆకస్మికంగా

మాయమవ్వడమే పంటరింగ్ –

ఇక్బాల్ చంద్.

(శిశువుకి తల్లి అన్నం తినిపించే అంత ప్రేమ లాగ  నాకు పనిని నేర్పించారు మా  IT గురువు పాల్  ఒ` రార్కి.

టాస్క్ పూర్తిచేయడం  లొ నా రిస్క్ తీసుకొనే తనం నచ్చి చాలా ప్రొత్సహించారు. ప్రేమగా మై డియర్  పంటర్ అని పిలిచే వారు. మై మాష్టర్ పాల్ కి ప్రేమతో ఈ పంటర్….)

Download Pantar poem 

11
Leave a Reply

avatar
9 Comment threads
2 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
11 Comment authors
Bhutham Muthyalurajyalaxmijayaprajaktaravindra Recent comment authors
  Subscribe  
newest oldest most voted
Notify of
Kavya
Guest
Kavya

Nice poem🤩Sir

Sudha
Guest
Sudha

Nice poem ,words are really nice….💐

Anitha
Guest
Anitha

Really good poem. I enjoyed it.great job sir

Devendra
Guest
Devendra

yEnu ayitu ri Mohammad Bhai, silky voice se punter roopantar .tumba chana kavita.
aap ka Dev

S.vara lakshmi
Guest
S.vara lakshmi

Hey Mohammad ,
kotha form baavundi
S.V.lakshmi

prajakta
Guest
prajakta

Bhai,
punter,silky voice, Bahadoor, amar chand ,KE Chand, iqbal chand, Khaja Mohammad, sailendra etc , aur kitne roop hai aapke.har ek naye jagah par phir naya naam.
could you please tell me how many faces living in single life. among of all faces silky voice is very much close to my heart.
Prajakta pande.

ravindra
Guest
ravindra

పని గట్టుకొని రాసినట్లుగా ఉంది,ఎవరో చెప్పి రాయించినట్లుగా ఉంది ఇక్బాల్.
–రవి

prajakta
Guest
prajakta

Ravi,

i think you have had read this poem during watching serial on television, i request you to please read again and come back…..

jaya
Guest
jaya

కచ్చితంగా ఇది డిఫరెంట్ ఫొం.ట్రైనింగ్ రోజుల్లో అప్పుడు ఒక్క రికార్డ్ రాయని మావొడు ఇప్పుడు ఎవొరో చెబితే కవిత్వం రాస్తున్నాడా?హా !!! హతవిధి!!!!నిజమా????
–జయ

rajyalaxmi
Guest
rajyalaxmi

కవిత చాలా బావుంది సార్!

–రాజ్యలక్ష్మి

Bhutham Muthyalu
Guest

Super