Uncategorized

Star Of The Week – Prof.Masana Chennappa

 • ఆచార్య మసన చెన్నప్ప ఉత్తమ అధ్యాపకులు, పరిపూర్ణ పరిశోదకులు సరళ హృదయుడు. సంభాషణ చతురుడు.వ్యక్యాణంలో హాస్యప్రియుడు.వ్యక్తిగా ఆయనొక తొణకని నిండు కుండ.
 • వేద వాజ్ముయాన్ని ఆపోసన పట్టి, ఉపనిషత్తుల పై పరిశోదన చేపట్టి సామాన్యుది భాషతో సమన్వయించి ఉపన్యసించడం చెన్నప్ప గారికి నిత్యకృత్యం.
 • సంప్రదాయ రీతిలో పద్య రచనను, ఆధునిక పంథాలలో గేయ వచన కవితలను అలవోకగా సృష్టించ గల కవిశ్రేష్టులు చెన్నప్ప గారు.అలా అటు ప్రాచెన సాహిత్యానికి, ఇటు ఆధునిక కవిత్వానికి నడుమ వారధిగా ఖ్యాతి గడించారు. సంస్కృతాంధ్ర భాషలలో సమంగా సృజన చెయగక్ల ప్రావీణ్యుడు. లోకమంతా మెచ్చిన రవీంద్రుని “గీతంజలి” ని లఘు కవితల రూపంలో వెలువరించిన పాదాలు ప్రత్యేకంగా చెప్పుకోదగిన, అనువాదాలైనా, సృజన సంపూర్ణాలు!ప్రతి పాఠకుడి గుండెల్లో నడయాడే “సడిలేని అడుగులు”.
                                                                                                                       —–ఆచార్య కడారు వీరారెడ్డి
                                                                                                                                                                                     పూర్వ ఉపకులపతి
                                                                                                                                                                    శాతవాహన విశ్వవిద్యాలయం
 • ఆచార్య మసన చెన్నప్ప గారు నాకు Ph.D.లో పర్యవేక్షకులు. ఆయన పరిశోధన గ్రంథమైన ‘ప్రాచీన కావ్యాలు గ్రామీణ జీవన చిత్రణ’లో ప్రాచీన కాలం నాటి ప్రజల జీవన విధానాన్ని వివరించారు. తన విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకునే అత్యున్నత వ్యక్తిత్వం గల ఆచార్యులు. ఉపనిషత్తులను ఔపోసన పట్టిన మహనీయులు. చెప్పిన మాటలను ఆచరణలో పెట్టే ఆచార్యులు. గంటల తరబడి అనర్గళమైన ఉపన్యాసాలు ఇవ్వగల వక్త.
 • ఆచార్య మసన చెన్నప్ప గారు సుమారు 30 గ్రంథాలను రచించారు. మల్లి పదాలు అనే రచనతో వీరి సాహితీ ప్రస్థానం ప్రారంభం అయ్యింది. వేల సంఖ్యలో ముత్యాలసరాలు రచించారు. పద్యాలను రాయగలిగిన వారైనా నానీలు వంటి ప్రక్రియలో కూడా రచనలు చేశారు.
 • ఆయన అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలను సందర్శించి అద్భుతమైన కవిత్వాన్ని అందించారు.
 • చెన్నప్ప గారి గురించి చెప్పడానికి ఈ మాటలు సరిపోవు. వారు మహా గ్రంథం
                                                                                                                                                               —–డా|| యస్ విజయ్ కుమార్
 • నాకు చెన్నప్ప సారు గారు ఆత్మీయగురువులు. ఉస్మానియాలో విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్తిగా 01-09-2018 వ తేదీన ప్రవేశ పొందాను. అప్పటికి నేను ఒక సాధారణ నిరుపేద నిరుద్యోగ విద్యార్థిని. Phd Topic ఎంచుకొనే సందర్భంలో గందరగోలంలో ఉన్నప్పుడు నా ఆసక్తిని గమనించి నా  భావానికి అనుగుణంగా Topic సూచించి దిశానిర్దేం చేసి నన్ను ఆశీర్వదించారు.
 • గురువు గారి అనుగ్రహం, ఆశీస్సుల ఫలితంగా నాకు 2018 Dec 19 UGCNET పరీక్షల్లోR.F మరియు T.R.T (DSC) 2019 మార్చి 1 న వెలువరించిన టీచర్ రిక్రూట్మెంట్ ఫలితాల్లో తెలుగు పండిత్ ఉద్యోగాన్ని సాధించాను.
 • చెన్నప్ప సార్ గారు ఒక ఆచర్యునిగా, సాహిత్య కారునిగా మాత్రమే కాదు గొప్ప ఆధ్యాత్మికవేత్త. వ్యక్తిత్వ వికాస నిపుణులు.
 • సార్ గారి సాహిత్య విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే. హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయడం లాంటిదే అవుతుంది.గురువు గారి ఇల్లే ఒక గంధాలయం. మా పరిశొధక విద్యాథులకి ఒక దిక్సూచి.
                                                                                                                                  —–పొనుగుల్ల నర్సయ్య
                                                                                                                                                                  ఉస్మానియా విశ్వవిద్యాలయం
 • చెన్నప్ప గారు 25 ఏళ్ళు గా నాకు పరిచయం. ప్రసిద్ద సాహితీవేత్త బహుగ్రంధకర్త. వేదాలు ఉపనిషత్తులు అధ్యయనం చేసిన వ్యక్తి. సాహితీ రంగం అందు వివిధ ప్రక్రియలలో అనేక గ్రంధాలను వెలువరించారు.
  • వచన కవిత్వం
  • ఉపనిషత్తులు
  • మిని కవితలు
  • నానీలు
  • ఆధ్యాత్మిక రచనలు చేసిన అనుభవం ఆయనకు ఉంది.
Masana Chennappa
—–దాస్యం సేనాధిపతి
 • ఉస్మానియా యూనివర్సిటి లో తెలుగు శాఖలో పని చేసి రిటైర్ద్ అయ్యారు.28 పుస్తకాలు రాసారు.
 • ఉపనిషత్తులు అనే complicated Subject ని సులువైన వాడుక భాషలోకి Transulate చేశారు.
 • ఉపనిషత్తులు, వేదాలు, వేద సాహిత్యం, దర్శనాలు, సాంఖ్య ఇలాంతి 10 రకాల అంశాల మీద Ethentic గా మాట్లాడ గలిగిన వ్యక్తి.
 • నాకు తెలిసి ఆయన ద్వారా ఒక 16 నించి 20 మంది దాకాd & M.phil పట్టాలు పొందారు.
 • ఉపనిషత్తులు ఆధ్యాత్మికంగానే కాదు మన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకునేందుకు సమాజాన్ని అర్థం చేసుకునెందుకు మనలో పరిణితిని నైపున్యాన్ని పెంచుకునేందుకు ఇప్పటి జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ఉపనిషత్ సాహిత్యం ఎలా ఉపయోగ పడుతుంది అని చాలా College ల లోను సాహిత్య వేదికల మీద మట్లాడారు.
 • దర్శనాల మీద చాలా మందికి కోచింగ్ తన ఇంట్లో ప్రొద్దున్న, సాయంత్రం ప్రభోధ చేస్తున్నారు
 • రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రాచీన సంప్రదాయ సాహిత్యాన్ని ఆధునిక సామాజిక దృష్టి  కోణం నించి సమన్వయం చేయటం సాహిత్య లోకంలో చాల తక్కువ మంది చేస్తారు వీరిలో చెన్నప్ప  గారు ప్రధములు అని చెప్పచ్చు.
 • సాహిత్య సేవలో ఎక్కడికి వెళ్ళినా కూడా తన సొంత డబ్బులతో వెలతారు.
 • నిడారంబరత కలిగి ఆడంబరాలు లేని వ్యక్తి.
 • అల్ప సంతోషి, ఎదుటివారిలో ఏ చిన్న ఉన్నాత గుణం కనిపించినా వారిని ప్రోత్సహించే వ్యక్తి, ఎప్పుడూ నవ్వు ముఖంతో మాట్లాడే వ్యక్తి.
 • భారతీయ జాతీయత వాద అవసరాన్ని గుర్తించి Tv Channel ల ద్వారా News paper ల ద్వారా  తన రచనల ద్వరా పుస్తకాల ద్వారా అందరికి విశిష్టతను చెప్పారు.
—–పాలకుర్తి రామమూర్తి (భువనగిరి)
 • పడుగూ పేకల పేదరికాన్ని
              ప్రేమించిన వారు.
     భాగ్య నగరం చేరి చదువు కోవడమే భాగ్యంగా భావించారు.
        లక్ష్య సాధనలో అలుపెరుగని ఏకలవ్యుడై
  ఇంతింతై,వటుడింతై ఉస్మానియా విశ్వవిద్యాలయం లోనే
           తెలుగు ఆచార్యులైనారు.
            అంతటితో ఆగలేదు.
            ఉపనిషత్తులను ఉపాసించారు.
            షేడ్దర్శనాలను అభ్యసించారు.
తెలుగు ఆచార్యులుగా,,ఆర్ష ధర్మ భావనా ఋషి గా ,సాహితీవేత్తగా మసన చెన్నప్ప గారు మనుషుల్ని ప్రేమించే మానవీయ మూర్తులు…..
—–డా.రాధేయ
వేద విజ్ఞాన నిధి,
ఉపనిషత్ పరిశోధకులు,
ధర్మ సూక్ష్మ పరిశీలకులు,
చతుర చమత్కార కవితా విద్వత్కవి,
పరిపూర్ణ పండిత గురుదేవుడు,
ప్రవచనా పరమేశ్వరుడు,
సమాజ సంస్కారవాది,
ఆచార్యులకే ఆచార్యుడు,
మహామహోపాధ్యాయులు
మహనీయులు శ్రీ ఆచార్య మసన చెన్నప్పగారు !
 • ఆచార్య మసన చెన్నప్పగారి విశిష్ట రచనలు :
Masana Books
—–పరమేశ్వర్ (Phd Student)
వృత్తి రీత్యా మంచి అధ్యాపకులు. మానవతా దృష్తి కలిగినవాడు. తన విద్యార్థులని సొంత బిడ్డల్లా ఆదరించి వారిలో విద్యా ప్రతిభను వెలిగించిన వారు.
ప్రాచీన సాహిత్యం పై లోతైన పరిశోధన చేసినాడు. పురాణాలు ఉపనిషత్తులు బాగా అధ్యయనం చేసినవాడు. అనేక సృజనాత్మక రచనలు చేసి కవిగా రచయితగా సుప్రసిద్దుడు. దేశ వ్యాప్తంగా అంతర్జాతీయం గా కూడ భారతీయ సంస్కృతిని సంప్రదాయాలను గూర్చి తన ఉపన్యాసాల ద్వారా ప్రజలకు పరిచయం చేస్తూ సాహిత్యమే జీవనం గా గడుపుతూ ప్రముఖ సాహితీ వేత్తగా ఆచార్యుడిగా పేరు తెచ్చుకున్నారు.   
—–Proff.యాదగిరి డైరెక్టర్ తెలుగు అకాడమి
 • వేద సంస్కృతిని ఆధ్యాత్మిక చింతనను ఆధునిక భావజాలాన్ని సమన్వయం చేసుకుని విలక్షన మార్గంలో ప్రయాణిస్తున్న కవి విమర్శకుడు పండితుడు ఆధ్యాత్మిక విశ్లేషకుడు ఆచార్య మసన చెన్నప్ప. పాండిత్యం కవిత్వం విమర్శనం ప్రసంగం ఉపనిషత్ సార ప్రవచనం వంటివాటితో లబ్ధప్రతిష్టులు. చతురోక్తులు ఛలోక్తులతో పాటు సూటిగా స్పష్టంగా సరళంగా మాట్లాడే నిర్మొహమాటి. భాషణా ఘనాపాటి ఆయన. ఏ రచన చేసినా నీతిని ధర్మాన్ని శాంతిని కాంక్షించారు.సంప్రదాయంలోని మంచిని ఆధునికంలోని హేతుబద్ధతనీ ప్రకటించారు. ఉపనిషత్తులను బ్రాహ్మనీయ భావజాలంలోంచి కాకుండా బహుజనుల కోణంలోంచి సూత్రీకరిస్తున్న నవ్యోపనిషత్ భాష్యకారుడు ఆచార్య మసన చెన్నప్ప గారు.
 • ఆచార్య మసన చెన్నప్పగారి సాహితీ వ్వక్తిత్వం సమున్నత మైంది. ఈయన రాసిన కవిత్వం ‌(వచనం పద్యం) ఖండకావ్యాలు నానీలు వ్యాసాలు వచన రచన పరిశోధన వంటివి సాహితీ రంగంలో శాశ్వతమైనవి. చెన్నప్ప గారు మంచి భావుకులు. సహ్రృదయులు.అన్వయ క్లిష్టతలేకుండా సరళ సుందరంగా తన రచనలను వెలయించారు. తాత్వికత ప్రధాన భూమికగా లౌకిక పారమార్థిక విషయాల మర్మాల్ని సందేశాత్మకంగా రచనలలో ప్రకటించారు. వీరి రచనలు మానవ సమాజానికి ధర్మాన్ని నీతిని బోధించాయి. ముఖ్యంగా ఉపనిషత్తుల సందేశాన్ని నూతన దృక్కోణంతో విశ్లేస్తుండటం వీరి ప్రత్యేకత.
                                      —–డా||బోడ జగన్నాధం
పరమపూజ్యులు, ఉపనిషత్తులపై phd చేసి, నాలుగు వేదాల అధ్యయనం చేసి, విశ్వమానవుడు వివేకానందునిల భారతీయ సంస్కృతి ని ధర్మప్రచారాలు సల్పుతున్న మహనీయుడు మసన చెన్నప్ప గారు, పండిత గోపదేవ్ శాస్త్రి గారిని గురువుగా స్వీకరించి ఆర్యుడై, కవిశ్వరునిగా పేరుగాంచి, జన్మనిచ్చిన తల్లి దండ్రుల పేరున అవార్డ్స్ఇస్తున్న ఘనుడు, దివంగత సతీమణి పేరుతో, ప్రమీలపీఠం పెట్టి ప్రతి ఏటా ప్రతీభా పురస్కారాలిస్తున్న మహామనిషి,  ఉస్మానియా విశ్వవిద్యాలయం లో విశ్రాంత తెలుగుశాఖ అధిపతిగా ఎందరినో phd, MPhil,విద్యార్థులు శిష్యులులతో, ఎన్నేఎన్నో సంపుటలు ప్రచురించిన వారు, దేశ విదేశాలసభలలో పాల్గొని ప్రశంశలందుకున్న వారు, ఎన్నో అవార్డ్స్ అందుకున్న ఆదరనియుడు,పుత్ర పౌత్రాదులతో ఆనందంగా ఉన్న ఆచార్య మసన చెన్నప్ప.. సాహిత్య ప్రియులకు ఆరాధ్యదైవం, వారి ఆశీస్సులు సదామావెంట ఉండునుగాక.
                                                                                        —-యల్ది సుదర్షన్ పద్మశాలి.

Leave a Reply

avatar
  Subscribe  
Notify of