Uncategorized

Star Of The Week – Togarla Suresh

Togarla Suresh

Togarla Suresh

1. తొగర్ల సురేష్ మంచి ఆధునిక భావాలున్న రచయిత సామాజిక భావాలున్న వారు. సాహిత్యాభిమాని. చిన్న చిన్న కథల కవితల ద్వారా సమాజంలో జరుగుతున్న యదార్థాన్ని చెప్పడానికి యత్నోస్తున్న వారు.

———దారం గంగాధర్.

2. తొగర్ల సురేష్ గారు వృత్తిరీత్య పోలిస్ డిపార్ట్ మెంట్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు,
పోలిస్ వృత్తి కత్తిమీద సాములాంటిది. వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన పాదచారుల మద్య ఉద్యోగం ఒక యుద్దంలాంటిది. ఈ ఉద్యోగానికి ఎంతో ఓపిక, సహనం, సదవగాహన, సంయమనం అవసరం. ఫ్రెండ్లీ పోలిస్ గావుంటు ప్రజల్లో మమేకమై వారిలో స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించే దిశగా ముందుకు సాగుతున్నారు.
• ఉద్యోగ భాద్యతలను నిర్వహిస్తునే సాహిత్యంపై మొగ్గుచుపుతూ తన రచనలను కొనసాగిస్తున్నారు, 2016 లో మొదలైన తొగర్ల సురేష్ గారి సాహితీ ప్రస్థానం నిజామాబాద్ జిల్లా కవులలో ఒక సుస్థిరమైనస్థానాన్ని సంపాదించుకున్నారు.

“అక్షరం”
అవినీతి గుండెల్లో
నిప్పురవ్వ అంటు,

“అక్షరం”
సమాజకోసం పోరాడె
సైనికుడు అంటు ముందుకు సాగుతున్న అక్షరశిల్పి తొగర్ల సురేష్ గారు …….

                 ఆధునిక సాహిత్యంలోసురేష్ గారి పాత్ర. అభ్యుదయ భావాలతో ముందుకు వెళుతున్న కవులలో ఒకరు. సామాజిక దృష్టి. సాహిత్య సుృష్టి తెలిసినకవి. కాలనుగుణంగా సమాజ సముద్రంలో ఇతను నిలదిసే నిజాలు విమర్శనాత్మక సందేశాలు. హాస్యమిళ్ళిత భావాలు జోడించి ఈ సమాజానికి రచనలు అందిస్తున్న గొప్ప కవి.
 సురేష్ గారు మా “ధాత్రి రాష్టస్ధాయి సాహితీ సాంస్కృతిక సంస్ధ”లో గౌరవ అధ్యక్షులుగా వున్నారు.
            వీరి రచన ప్రతిభను గుర్తించి మా ధాత్రి సంస్ధ నుంచి 2017 సం” లో ప్రతిభా సేవారత్న పురస్కారం ఇ చ్చాము.
• “అక్షరం”మనిషిని మానవత్వంవైపు నడిపే ఒక ఆయుధమంటు ముందుకు సాగుతున్న ఒక గొప్పవ్యక్తి తొగర్ల సురేష్ గారు ……

———-రచయిత్రి మల్లవరపు విజయ

                                                                        ధాత్రి రాష్టస్ధాయి సహితీ సాంస్కృతిక సంస్ధ అధ్యక్షులు.

3. సురేష్ గారు నిజామాబాద్ జిల్లా రచయిత. మంచి మనస్తత్వం, కలుపుగోలు వ్యక్తిత్వం, వృత్తి కఠినమైనా ప్రవృత్తి సున్నితం. రచనా రంగంలో ఆసక్తి కలిగిన వ్యక్తి.

                    ఈ మధ్య కాలంలోనే రచనలు చేయడం మొదలు పెట్టినప్పటికినీ ఎక్కువ పుస్తక రచన చేయగలిగాడు.సమాజం పట్ల భాధ్యతను గుర్తించి తన రచనలలో మెరుగైన సమాజాన్ని కోరుకుంటూ కథలు రాస్తున్నాడు. నిజాన్ని నిక్కచ్చిగా సూటిగా రాయగల ధైర్యంగలవాడు.

                                                       ——-శారద

4. సామాజిక దృష్టితో అత్యంత వేగంగా రచనలు చేసే కరుణ రసాత్మక రచయిత….

        రచించడంలో వేగం తగ్గించుకొని ఇతరుల సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే ఆధునిక సాహిత్యంలో ఉత్తమ రచయితగా తప్పక గుర్తింపు సాధిస్తారు శ్రీ తొగర్ల సురేష్ గారు……శుభాకాంక్షలు.                                                                             

             —————-చందన్ రావ్

5. శ్రీ తొగర్ల సురేష్ గారు మంచి వర్ధమాన రచయిత. అభ్యుదయ భావాలు ఉన్న వారు. సృజనాత్మక శీలి.ఆత్మీయుడు.నిగర్వి. ఇప్పటివరకు సుమారు పదికి పైగా గ్రంథములను ఆవిష్కరించి నారు.

           అన్ని ఉన్నతమైన సందేశాత్మకాలే.తాను కవి అగుటయేగాక ఇతర కవులను సత్కరించే మంచి స్వభావము ఇతనిది.ఈ కవి అనేక బిరుదులను; పురస్కారాలను; సన్మానాలను అందుకున్నారు.

           శ్రీ సురేష్ గారు చేసేది రక్షకభటవృత్తి. రచనా వ్యాసంగము అతని ప్రవృత్తి.వృత్తిలో తీరిక లేకున్నా దొరికిన  కొద్ది

          సమయాన్ని కవితారచనకే వెచ్చిస్తున్నారు.వృత్తిలో భాగంగా ప్రజలకు తన సహాయ సహకారాలను అందించే నైజము గలవారు.

        అత్తాకోడళ్ళ సంభాషణలు; భార్యభర్తల అనుబంధాలు; ప్రక్కింటి వారితో సంభాషణ లు ప్రజలలో తానుకూడా ఒక్కడినే అనే సందేశం; బావామరదళ్ళ చిలిపి చేష్టలు అన్ని ఇతని రచనలలో గోచరిస్తాయి. ప్రజోపయోగకర సందేశాలను వ్యాప్తి చేయుటలో దిట్ట. కలుపుగోలుతనము ఇతనిప్రత్యేకత. సాహిత్య రంగంలో ఈ కవిచేసిన ప్రయోగాలు విభిన్న ప్రజోపయోగకరాలు. సాహిత్య రంగమందు సురేష్ గారిది ప్రత్యేక స్థానమని చెప్పుట ఉచితము.

———ఎండెల నరసింహలు. M.A. MEd.

విశ్రాంత తెలుగు పండితులు. ( కవిశేఖర; కవితావిశారద;  కవి వతంస; ఆర్య గురు.) జిల్లా,

రాష్ట్ర ప్రభుత్వ  ఉత్తమ

ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు. ఇందూరు( నిజామాబాదు).

6. ఎంతో ఓర్పు నేర్పుఉన్నవ్యక్తి  వృత్తి, ప్రవృత్తిని సమాంతరంగ సమాజసేవక్తె అంకితంచేస్తున్న గొప్పవ్యక్తి.

        చిన్నపిల్లలు స్తెతం సులువుగా చేప్పుకునే భాష శ్తెలి నిత్యజీవితంలో  జరిగే ఘటనలను తెలియజేసే కధనంవీరివిశేషం.

—–పంచరెడ్డి లక్ష్మణ్

7. సమాజానికి రెండు కన్నులు.ఒకటి చట్టం.రెండవది సాహిత్యం. చట్టం రక్షణ…. సాహిత్యం…. మార్పు వైపు ఈ రెండింటికి కలయిక. మన తొగర్ల సురేష్ సర్.గారు..రక్ష కుడు..రచయిత ఆధునిక సాహిత్యం లో మొదటి స్థానం.. ఈ మధ్య తాను వ్రాసిన పుస్తకాలు నేటి కుటుంబాలకు అద్దంలా కనిపిస్తోంది. సంబంధ భాంధాలు ఎలా ఉండాలి ఒకతల్లి,చెల్లి,అక్క అమ్మ నాన్న, కోడలు, అత్త, అమ్మాయి, ఆశలు అలవాట్లు, ఇలా అందరి మనోభావాలకు మార్గ దర్శనం అతని రచనలు నాకు వర్ణించడానికి మాటలు రావడం లేదు.

——–జెస్సు. అరుంధతి.

                                                                                                                                                 ఆర్మూర్…

8. సురేష్ గారు మాకు తెలిసినంత వరకు చాల మంచి వ్యక్తి తన విధిని చాల చక్కగా నిర్వహిస్తారు

      నేటి ఆధునిక సమాజంలో తన రచనల ద్వారా మంచి మార్పు కోసం ప్రస్తుతం కుటుంబంలో అవగాహన లేని కారణాల వలన సమస్యల పరిష్కారం కొరకు తన రచనలు మరియు సమాజంలో శాంతీ మత సామరస్యం కొరకు దోహద పడుతున్నయి.

———-షేక్ హుసేన్

9. సామాజిక దృక్పథ కవిత్వం రాస్తూ తాను పని చేసే శాఖలోనూ పేరు తెచ్చుకుని నిజామాబాద్ కు గర్వ కారణమయ్యారు!

          అనేక ఇతివృత్తాల్లో సాహిత్య కృషి చేస్తూ ఇతరులకు ప్రేరణ అయ్యారు.

———కందాళై రాఘవాచార్య

10. సురేష్ గారు పోలీసు ఉద్యోగం చేస్తూ తన పదునైన ఆలోచనలతో మంచి కవితలు, కథలు వ్యాసాలు రాసి మన ఇప్పటి సమాజాన్ని తనదైన శైలిని నిజామాబాదు సాహిత్య లోకానికి అందిస్తున్నారు

        ఆధునిక తెలుగు సాహిత్యం లో మన సమాజం లో ఉన్న వివిధ బలహీనతలను తన కవిత్వం ద్వారా మార్పుకై పోరాటం చేస్తున్న గొప్ప కవివరేన్యుడు అని చెప్పవచ్చు.

——-వెంకట రమణ చారి

    

 

 

Leave a Reply

avatar
  Subscribe  
Notify of